Gargeyi Hello Meera Movie సినిమాలో ఇన్ని కారెక్టర్లు ఉండాలనే నియమం ఏమీ ఉండదు. భారీ తారాగణంతో సినిమాలు తీయొచ్చు. ఓ పది మంది ఆర్టిస్టులతోనూ సినిమా తీయొచ్చు. కానీ ఒకే ఒక్క మనిషిని చూపించి సినిమా తీయడం, ఒకే కారెక్టర్‌తో సినిమాను తీయడం అంటే మామూలుగా విషయం కాదు. కానీ ఇప్పుడు గార్గేయి అలాంటి ఓ ప్రయోగాత్మక సినిమాలోనే నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ దర్శకులు బాపుతో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను ఎలా తీసి ఉంటారు అని జనాలు సైతం ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. 


తాజాగా ఈ మూవీ నుంచి నా కనులలో నా కలలలో అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎస్ చిన్నా అందించిన బాణీ , శ్రీ సాయి కిరణ్ రాసిన సాహిత్యం, సమీర భరద్వాజ్ గాత్రం ఈ పాటను ఎంతో వినసొంపుగా చేశాయి. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక  చిత్రాన్ని నిర్మించారు. సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.


 



డా: లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు. అసలే ఇప్పుడు అంతా కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హలో మీరా సినిమా కంటెంట్ జనాలకు ఎంత వరకు నచ్చుతుందో చూడాలి.


Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్


Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook