Operation Valentine


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన వరుణ్ తేజ్…ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. గని సినిమా విడుదలైన దగ్గర నుంచి ఈ హీరోకి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన గాంధీవడారీ అర్జున్ సినిమా అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. దీంతో హీరో ఆశలన్నీ తన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా పైన పెట్టుకున్నాడు. ఈ చిత్రం హిందీలో కూడా విడుదలవుతూ ఉండదంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటున్నారు మీ హీరో. ఎలాగైనా ప్రేక్షకులకు దగ్గరై ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ చూస్తూ ఉండగా.. తాజాగా ఆయన తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం విమర్శలకు దారితీసాయి.


మొన్ననే ఆపరేషన్ వాలెంటైన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. నాగబాబు ఈ ఈవెంట్లో.. సినిమా గురించి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారుల గురించి, తమ ఫ్యామిలీకి ఆర్మీకి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అయితే ఇదే ఈవెంట్ లో తన కొడుకు వరుణ్ ని ఉద్దేశించి.. కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు నాగబాబు.


‘పోలీసాఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడటానికి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ దానికి బాగా సెట్ అయ్యాడు. తను 6 అడుగుల మూడు అంగుళాలు హైట్ ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రలకి 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే సెట్ అవ్వదు’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన సాధారణంగా చేసినవే అయినా కానీ కొంతమంది హీరోల అభిమానులు మాత్రం తమ హీరోనే అన్నారని నాగబాబుపై విమర్శలు చేసారు.  దీంతో సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.


తాజాగా ఇదే విషయంపై క్షమాపణలు కోరుతూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెద్ద పోస్ట్ వేశాడు నాగబాబు. ఈ పోస్ట్ లో నాగబాబు ఇలా రాసుకువచ్చారు.. ‘ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే క్షమాపణలు కోరుతున్నాను..I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసారు. 


 




మరి నాగబాబు ఇంత వివరంగా ఇచ్చాకైనా వేరే హీరో అభిమానులు చల్లబడతారో లేదో చూడాలి.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


 



 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter