Naga Chaitanya Upcoming Movie:  టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఈ ఏడాది చైతూ.. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం చైతూ ఆశలన్నీ చందు మొండేటి సినిమాపైనే ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘తండేల్’(Thandel Movie) అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన లుక్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి చేపలవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతుంది. 



ఇటీలవ దూత వెబ్ సిరీస్‌తో (Dhootha Web series) వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైన ఈ సిరీస్ ఏకంగా 240 దేశాల్లో 38 భాషల్లోని సబ్ టైటిల్స్‌తో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. శరత్ మరార్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు.



Also read: Leelavathi: కన్నడ దిగ్గజ నటి లీలావతి కన్నుమూత.. ప్రధాని మోదీ, సీఎం సిద్ధరామయ్య సంతాపం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి