Chaysam divorce: అక్కినేని నాగ చైతన్య- హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న విషయం కొంత కాలంగా టాలీవుడ్​లో హాట్​ టాపిగ్​గా మారిన విషయం (Naga Chaitanya Samantha Divorce) తెలిసిందే. గత ఏ ఏడాది వీరు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి.. మంచి స్నేహితులుగా ఉంటామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే విడాకుల విషయం వారి వ్యక్తిగతమైనప్పటికీ.. సెలెబ్రెటీలు అయినందున ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తోంది.


వీరి విడాకుల కారణంగా టాలీవుడ్ లేడీ​ డైరెక్టర్​ ఒకరు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు సమంతకు 'ఓ బేబీ' సినిమాతో మంచి హిట్​ ఇచ్చిన (Nandini reddy Movie Samantha) నందిని రెడ్డి.


అసలు విషయం ఏమింటంటే..


నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోకముందు.. వారిద్దరితో కలిపి ఓ సినిమా ప్లాన్ చేశారట (Nandini reddy Movie) నందిని రెడ్డి. సినిమాను పట్టాలు ఎక్కించేందుకు కూడా సిద్ధమయ్యారంట. అయితే విడాకుల తర్వాత.. నాగ చైతన్య, సమంతలు ఎవరి పనుల్లో బిజీగా మారిపోయారు. ఇద్దరు కలిసి ఒక్క సారి కూడా మాట్లాడుకోలేదు.


ఓ వైపు సమంత తెలుగుతో పాటు.. బాలీవుడ్​ వెబ్​ సిరీస్​లు, హాలీవుడ్​ మూవీలతో (Samantha Films) బిజీగా గడుపుతున్నారు.


మరో వైపు నాగ చైతన్య కూడా విడాకుల తర్వాత ఆమిర్​ఖాన్ సినిమా షూటింగ్​లో పాల్గొన్నారు. తెలుగులో లవ్​ స్టోరీ రిలీజ్​ అయి మంచి విజయం సాధించింది. తాజాగా నాగ చైతన్ నటించిన బంగార్రాజు కూడా నేడు (జనవరి 14) విడుదలైంది. ఇలా వరుస సినిమాలతో నాగ చైతన్య బిజీ బిజీగా (Naga Chaitanya Films) ఉన్నారు.


దీనితో నందిని రెడ్డి సినిమా అటకెక్కినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగ చైతన్య, సమంతల ఇద్దరిలో ఒక్కరు కూడా నందిని రెడ్డి సినిమా గురించి ఆలోచించడం లేదని టాలీవుడ్ వర్గాల టాక్​. దీనితో నందినీ రెడ్డి ఆయోమయంలో పడ్డారని సమాచారం. ఓ సినిమాకు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా జరగటం అనేది నందిని రెడ్డికి తీవ్ర నష్టాన్ని మిగిల్చినట్లు సినీ వర్గాలు (Nandini reddy Movie with Naga Chaitanya Samantha) చర్చించుకుంటున్నాయి.


Also read: Bangarraju Review: నాగార్జున- నాగచైతన్య బంగార్రాజు ఫైనల్ రివ్యూ.. ఎలా ఉందంటే.??


Also read: Rashmi Gautam: కొంటె చూపులు, నడుము అందాలతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook