Naga Shaurya fiance Anusha Setty: నాగ శౌర్య కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే.. అన్ని వందల కోట్లకు వారసురాలా?
Nagashourya fiance Anusha Setty: నాగశౌర్య పెళ్లి చేసుకో బోయే అమ్మాయి పేరు అనూష శెట్టి కాగా ఆమెకు సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Nagashourya fiance Anusha Setty Details: హీరో నాగశౌర్య అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే అనూష ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే విషయాల మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. అయితే ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు మా దృష్టికి వచ్చాయి. వాటిని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఆ అనూష పూర్తి పేరు అనూష శెట్టి. ఆమె బెంగళూరు బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న ఆమె ప్రస్తుతం అనూష శెట్టి డిజైన్స్ ఓపిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్ నడుపుతోంది.[[{"fid":"251934","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన బెంగళూరు బేస్డ్ వ్యాపారవేత్త కుమార్తె అయిన ఆమె 2019 సంవత్సరానికి గాను డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపాదించింది. అలాగే 2020 సంవత్సరానికి కూడా డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంపాదించింది. అలాగే అండర్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డు కూడా ఆమె సంపాదించింది. ఇక మోస్ట్ క్రియేటివ్ ఇంటీరియర్ డిజైనర్ 2020 ఫర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అవార్డు కూడా ఆమె సంపాదించింది. ఆమె చదువు విషయానికి వస్తే బెంగళూరు జైన్ యూనివర్సిటీలో ఆమె బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసింది. తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.
ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కూడా మరోసారి ఎంబీఏ చేసిన ఆమె ఆ తర్వాతే న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె జైన్ యూనివర్సిటీ కి మార్కెటింగ్ ఇంటర్న్ గా కూడా పనిచేశారు 2018 జనవరిలో ఈ అనూష శెట్టి డిజైన్స్ ఓపిజి ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి బెంగళూరు, బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రమే కాకుండా కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాజెక్టులు చేసినట్లు తెలుస్తోంది. ఆమె తనకు మొత్తం ఆరు భాషల్లో మాట్లాడగలనని తన లింక్డ్ ఇన్ బయోలో పేర్కొంది.
ఇంగ్లీష్, హిందీ, కన్నడ మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, తుళు భాషల్లో కూడా ఆమె చక్కగా మాట్లాడగలదట. అయితే ఒక సినిమా హీరో ఇలా ఒక యంగ్ వుమెన్ వ్యాపారవేత్తను ఎలా పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. బహుశా ఇది ప్రేమ వివాహం అయిఉంటుందని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతని ఇంటి పేరు మూల్పూరి. అలాంటి వ్యక్తి వేరే రాష్ట్రానికి చెందిన బంట్ అనే సామాజిక వర్గానికి చెందిన ఈ అనూష శెట్టిని వివాహం చేసుకోవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: Ori Devuda in OTT: ఆహాలో ఓరి దేవుడా.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందంటే?
Also Read: Naga Shaurya Marriage: నాగశౌర్య పెళ్లి ఫిక్స్.. మరో పది రోజుల్లోనే... అమ్మాయి ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook