Nagachaitanya Fisherman Role: థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, ఇటీవల విడుదలైన కస్టడీ సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకుని డీలా పడిపోయాడు నాగచైతన్య. ఇక ఆయన తదుపరి చిత్రం చందూ మొండేటి దర్శకత్వంలో ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా ఈ కథ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు ఆ సినిమా నిర్మాత బన్నీ వాసు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకేకపోతుందని గుజరాత్కు చెందిన ఒక మత్స్యకారుడి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చాడు, ఈ సినిమా ఒక ప్రేమ కథ అని కూడా చెప్పుకొచ్చాడు ఆయన, అయితే నిజానికి గుజరాత్ నుంచి ఎక్కువగా జాలర్లు పాకిస్తాన్ నేవీ చేతుల్లో చెక్కి జైలు శిక్ష అనుభవించిన కథలు ఎన్నో బయటకు వచ్చాయి. బహుశా అలాంటి కథ ఏదైనా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


Also Read: Prabhas Project k : ప్రాజెక్ట్ కేతో బాహుబలి రికార్డులు అవుట్.. రానా కామెంట్స్ వైరల్


ఇక ఈ సినిమాకి నాగచైతన్య కెరీర్ లోనే అత్యధికంగా 60 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నాగచైతన్య కెరియర్ లో అంత భారీ బడ్జెట్లో ఎలాంటి సినిమా చేయలేదు. కానీ కథ డిమాండ్ చేయడంతో పాటు చందు మొండేటి కథ మీద ఉన్న నమ్మకంతో అంత ఖర్చు పెట్టడానికి కూడా అల్లు అరవింద్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నాగ చైతన్య సహా అక్కినేని అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమాతో అయినా నాగచైతన్య మంచి హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇక ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ దాదాపు అన్ని భాషల్లోనూ మంచి హిట్ టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్టవుతుందని బన్నీ వాసు సహా అల్లు అరవింద్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా నాగచైతన్యకు ఎంతవరకు కలిసి రాబోతోంది అనేది.


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK