Nagarjuan Akkineni The Ghost Movie Review and Rating: నాగార్జున ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. కొత్త తరహా కథలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాడు. అలాంటి కింగ్ నాగ్.. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకు ఛాన్స్ ఇచ్చాడు. గుంటూరు టాకీస్, గరుడవేగ వంటి చిత్రాలతో మెప్పించాడు. అలాంటి దర్శకుడికి నాగ్ చాన్స్ ఇవ్వడంతో ది ఘోస్ట్ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఇటు దర్శకుడిగా ప్రవీణ్ సత్తారుకి, హీరోగా నాగార్జునకు ఏ మేరకు ఉపయోగపడిందన్నది ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్. ప్రియ (సోనాల్ చౌహాన్) విక్రమ్ సహోద్యోగి. ఓ ఆపరేషన్ క్రమంలో..  పిల్లాడిని కాపాడలేకపోతాడు విక్రమ్. దీంతో అండర్ వరల్డ్ మీద యుద్దానికి వెళ్తాడు విక్రమ్. కానీ ప్రియ వద్దని చెబుతుంది. అయినా విక్రమ్ వినడు. అయిదేళ్ల తరువాత విక్రమ్‌కి తన అక్క అనుపమ (గుల్ పనాగ్)కాల్ చేస్తుంది. తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) డేంజర్లో ఉందని, కాపాడమని కోరుతుంది. దీంతో విక్రమ్ రంగంలోకి దిగుతాడు. అదితికి కాపాలకాస్తుంటాడు. నాయర్ కంపెనీ అధినేతగా అనుపమకి ఉన్న శత్రువుల గురించి విక్రమ్ ఆరా తీస్తుంటాడు. నాయర్ కంపెనీ, సినార్ గ్రూప్స్ మధ్య గతం నుంచి ఉన్న విరోధం గురించి తెలుసుకుంటాడు. అయితే అదితి, అనుల చంపేందుకు కుట్ర పన్నింది ఎవరు? ఆ కుట్రలో పంకజ్ నాయర్ (రవి వర్మ), సిద్దాంత్ నాయర్ పాత్ర ఏంటి? అసలు కిడ్నాపర్ల గ్యాంగ్‌కు విక్రమ్ కాదని, ఘోస్ట్ అని తెలిశాక ఏం చేసింది? చివరకు అదితి, అనులను విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ.


నటీనటులు
విక్రమ్ పాత్రలో నాగార్జున తన అనుభవంతో అవలీలగా నటించేశాడు. అయితే ఘోస్ట్ పాత్రకు తగ్గట్టుగా స్క్రీన్ మీద అంత ప్రభావం కనిపించలేదు. నాగ్ లుక్స్, స్టైలీష్ యాక్షన్స్ బాగున్నాయి. సోనాల్ చౌహాన్ అందంగా కనిపించడమే కాకుండా.. అదిరిపోయే స్టంట్స్ చేసింది. గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అదితి పాత్రలో అనికా మెప్పిస్తుంది. రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విలన్లుగా కనిపించిన వారంతా కూడా తమ పరిధి మేరకు నటించేశారు.


విశ్లేషణ
ది ఘోస్ట్ ట్రైలర్, టీజర్ చూస్తే.. ఇదేదో స్టైలీష్, యాక్షన్ డ్రామా అని అనుకుంటారు. కొత్త కథను ఇంకాస్త కొత్తగా స్టైలీష్‌గా చూపించబోతోన్నాడని అనుకుంటాం. కానీ దర్శకుడు మాత్రం అదే పాత కథను, రివేంజ్ స్టోరీని కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అందులో కూడా తడబడ్డట్టు కనిపిస్తోంది. ది ఘోస్ట్ అంటూ.. ఘోస్ట్ పాత్రను చూపించిన తీరు నవ్వొస్తుంది. ఘోస్ట్‌గా నాగార్జున అందరినీ ఇట్టే నరుక్కుంటూ వెళ్తుంటే.. అండర్ వరల్డ్ డాన్స్ అంతా కూడా కళ్లప్పగించి చూస్తుంటారు. 


అలా ది ఘోస్ట్ సినిమాలో ఎన్నో నవ్వు తెప్పించే, సిల్లీ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నా లాజిక్‌లకు దూరంగా ఉంటాయి. కేజీయఫ్, విక్రమ్ మేనియా నుంచి బయటపడనట్టు కనిపిస్తోంది. మిషన్ గన్‌తో చివర్లో నాగార్జున చేసే విధ్వంసం ఆ సినిమాలను గుర్తు చేస్తుంది. ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఏదో కొత్తగా ఉంటుందని అంతా భావిస్తారు. కానీ అసలు ఫ్లాష్ బ్యాక్ అంటే ఇదేనా? అని అనిపించేంత సిల్లీగా ఉంటుంది.


ది ఘోస్ట్ విషయంలో ప్రథమార్థం కాస్త పర్వాలేదనిపించింది. సెకండాఫ్ మాత్రం దారుణంగా తేలిపోయింది. ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ సీరియస్‌గా సాగడం పక్కన పెడితే.. మరీ సిల్లీగా అనిపిస్తుంది. కత్తి పట్టుకుని అందరి ఏరిపారేస్తోంటో.. చూస్తున్న ప్రేక్షకుడు నవ్వుకోవాల్సిందే. ప్రవీణ్ సత్తారు తీసుకున్న పాయింట్.. పాతదే అయినా మేకింగ్ కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కథనం మాత్రం అంత గ్రిప్పింగ్‌గా సాగదు. ఈ చిత్రం విషయంలో కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


బాటమ్ లైన్ : ది ఘోస్ట్.. ప్రేక్షకులకు రోస్ట్


Rating: 2.25/5


Also Read: Oke Oka Jeevitham OTT Release: శర్వానంద్ 'ఒకే ఒక్క జీవితం' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..!


Also Read: God Father Movie Review: మెగాస్టార్ మెంటల్ మాస్.. అల్లాడించాడుగా.. సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook