Nagarjuna Gets Emotional after watching Sharwanands Oke Oka Jeevitham movie: యువ హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఒకే ఒక జీవితం'. శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌ఆర్ ప్ర‌భు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'ఒకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్‌ కాబోతోంది. సినిమా రేపే విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 'ఒకే ఒక జీవితం' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం బుధవారం ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. సినిమా చూసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. సినిమా చూసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... 'ఒకే ఒక జీవితం సినిమా భావోద్వేగభరితంగా ఉంది. దర్శకుడు చాలా అందంగా తీశారు. తల్లి సెంటిమెంట్‌ ఉన్న ఈ సినిమా చూస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది' అన్ని అన్నారు. 



ప్రీమియర్‌ షో చూసిన కింగ్ నాగార్జున  'ఒకే ఒక జీవితం' చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నాగ్ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైమ్‌ ట్రావెల్‌, మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అక్కినేని అమల, శర్వానంద్‌ తల్లీ కొడుకులుగా నటించారు. దాదాపుగా పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్రలో అమల నటిస్తున్నారు. 


Also Read: Viral Video: ఏనుగుకి దురద వేస్తే ఇట్లనే ఉంటది మరి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!


Also Read: NEET 2022 Results: నీట్‌ 2022 ఫలితాలు విడుదల..  తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి