NEET UG 2022 Results Out: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ క్యుములేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష 2022 ఫలితాలను విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో రాజస్తాన్‌కు చెందిన తనిష్క ఉత్తమ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR 1) సంపాదించింది. తనిష్క 720కి 715 స్కోర్ చేసింది. తనిష్క స్వస్థలం హర్యానా అయినా.. రాజస్థాన్ నుంచి నీట్ పరీక్ష రాసింది. 9,93,069 మంది అభ్యర్థులు నీట్ 2022 పరీక్షకు అర్హత సాధించారు. నీట్ పరీక్ష అర్హత శాతం 56.27%గా ఉంది. neet.nta.nic.inలో నీట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తనిష్క నీట్ టాప్ ర్యాంక్ సాధించగా.. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంక్ సంపాదింది. కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలే, రుచా పవాషే మూడు, నాలుగు స్థానంలో ఉన్నారు. తనిష్క స్కోరు (715) రెండు, మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్న వారితో సమానంగా ఉంది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు (711), మహారాష్ట్రకు చెందిన రిషి వినయ్ బల్సే (710), పంజాబ్‌కు చెందిన అర్పిత్ నారంగ్ (710), కర్ణాటకకు చెందిన కృష్ణ ఎస్‌ఆర్ (710), గుజరాత్‌కు చెందిన జీల్ విపుల్ వ్యాస్ (710). , మరియు జమ్మూ మరియు కాశ్మీర్‌కు చెందిన హజిక్ పర్వీజ్ లోన్ (710) జాతీయ స్థాయిలో టాప్ 10లో ఉన్నారు.
నీట్ 2022 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు 5వ ర్యాంకు సాధించారు. తెలంగాణ నుంచి చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె జీవన్‌కుమార్ రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్విని శ్రీ 52వ ర్యాంకు సాధించారు. టాప్ 50 అభ్యర్థులలో 32 మంది పురుషులు ఉండగా.. 18 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది నీట్ యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.17 లక్షల మంది అర్హత పొందారు.
Also Read: God Father Movie Postponed: గాడ్ ఫాదర్ వాయిదాపై పెదవి విప్పిన నిర్మాత
Also Read: Telangana Rains:దక్షిణ తెలంగాణలో కుండపోత వాన... హైదరాబాద్ లో వరద విలయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి