Nagarjuna: మొన్న తోసేశారు.. ఈరోజు దగ్గరికి తీసుకున్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున వీడియో
Nagarjuna Viral Video: ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక అభిమానికి సంబంధించిన ఈ వీడియో పైన.. సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఆఖరికి ఆ వీడియో నాగార్జున క్షమాపణలు కోరే వరకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జునకి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది.
Nagajuna Video:
అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. మిగతా ఇండస్ట్రీ వారికి కూడా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న కుబేర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు నాగార్జున. ఈ క్రమంలో ఈ మధ్య నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీసింది.
నాగార్జున ఎయిర్ పోర్ట్ లో నుంచి వస్తుంటే.. పక్కన ఉన్న నాగార్జున బాడీ గార్డ్.. మానసిక వైకల్యంతో ఉన్న ఓ పెద్దాయనని.. నాగార్జున వైపు వస్తుండగా తోసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియో పైన ఎన్నో చర్చలు జరిగాయి. అసలు విషయానికి వస్తే నాగార్జున ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా.. అక్కడ పనిచేసే వ్యక్తి ఒకరు నాగార్జునని చూసి.. మాట్లాడటానికి వచ్చాడు. దీంతో నాగార్జున పక్కనున్న బాడీగార్డ్.. అతన్ని పట్టుకొని..పక్కకు తోసేసాడు. ఆ వ్యక్తి పడిపోబోవడంతో అక్కడే పనిచేస్తున్న వేరే వ్యక్తులు వెళ్లి పట్టుకున్నారు. కానీ ఈ సంఘటనను నాగార్జున గమనించలేదు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నాగార్జున పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక దీనికి నాగార్జున స్పందించి.. ‘ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాను అని పోస్ట్ పెట్టారు.
ఇదంతా అయిన తర్వాత..తాజాగా నాగార్జున ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా ఆ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని.. నాగార్జున దగ్గరికి పిలిపించి మరి కలిసి మాట్లాడారు. నాగార్జున పిలిచి మాట్లాడటంతో ఆ వ్యక్తి చాలా ఆనందానికి గురయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే మొన్నేమో అలా తోసేసి ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారని.. కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటే. అయితే నాగార్జున పరిస్థితి అర్థం చేసుకున్న వారు మాత్రం. మొన్న తెలియక జరిగిన తప్పుకు.. ఇప్పుడు ఇలా నాగార్జున పిలిచి మాట్లాడి మంచి పని చేశారని.. కామెంట్స్ చేస్తున్నారు.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి