Nagarjuna meets AP CM YS Jagan: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం అధికారిక నివాసంలో గురువారం మధ్యాహ్నం లంచ్ మీటింగ్‌లో సీఎం జగన్‌ని కలిసిన నాగార్జున.. టికెట్ల ధరల పెంపుతో పాటు పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల విక్రయాలు జరపాలని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాంటి ఇతర సమస్యలపై చర్చించారని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున  భేటీలో మరో ప్రముఖ నిర్మాత, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ చిత్రనిర్మాణ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి (Producer Niranjan Reddy) కూడా పాల్గొన్నారు.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని మునిసిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ థియేటర్స్‌లో టికెట్ల ధరలు రూ. 40 మించరాదు అంటూ ఇటీవల ప్రభుత్వం విధించిన నిబంధనల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్ (AP Film tickets portal) అందుబాటులోకి వచ్చిన అనంతరం టికెట్ల ధరలపై సైతం సమీక్ష చేపట్టి నిర్ణయం తీసుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున వెళ్లి సీఎం జగన్‌తో భేటీ (Nagarjuna meets AP CM YS Jagan) అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల్ని చర్చించేందుకే టాలీవుడ్ తరపున నాగార్జున వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో నాగార్జునకు మంచి అనుబంధం, చనువు ఉన్నాయి. ఈ కారణంగానే సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి నాగార్జున (Nagarjuna Akkineni) చొరవ తీసుసుకుని ఉండవచ్చని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.