Naa Saami Ranga 3 Days Collections: ఆశ్చర్యపరుస్తున్న నా సామి రంగా.. మూడురోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా
Naa Saami Ranga Collections : సంక్రాంతి పోటీలో చివరిగా విడుదలైన సినిమా నాగార్జున నా సామిరంగా. టీజర్ నుంచి మంచి అంచనాలు ఏర్పడుచుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Naa Saami Ranga First Weekend Collections : సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తేజ సజ్జ హనుమాన్.. మహేష్ బాబు గుంటూరు కారం విడుదల కాగా.. ఆ తరువాత జనవరి 13న వెంకటేష్ సైంధవ్ రిలీజ్ అయింది. ఇక అన్నిటికన్నా చివరిగా విడుదలైన చిత్రం మాత్రం నాగార్జున నటించిన నా సామి రంగా.
వరస ప్లాపులతో సతమతమవుతున్న నాగార్జునకు ప్రస్తుతం సూపర్ హిట్ ఎంతో అవసరం. అది మైండ్ లో పెట్టుకొని .. నాగార్జున తనదైన స్టైల్ లో కథ ఎంపిక చేసుకొని.. తనకు ఎంతో అచ్చి వచ్చే సంక్రాంతి సీజన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం టీజర్ దగ్గర నుంచి అంచనాలను పెంచుతూ వచ్చింది. సంక్రాంతికి నాగార్జున తప్పకుండా ఫుల్ మీల్స్ పెడతారు అన్నట్టు ఈ సినిమా ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకుంది.
అనుకున్న రేంజ్ లో సూపర్ హిట్ కాకపోయినా ప్రస్తుతం మాత్రం ఈ చిత్రం అందరి దగ్గర నుంచి పర్వాలేదు అనిపించుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సుమారుగా వసూలు సాధిస్తుంది. నా సామిరంగ సినిమా మొదటి రోజు 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. ఇప్పుడు మూడు రోజుల్లో ఈ సినిమా 24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇదే విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇంకా కూడా సంక్రాంతి సెలవులు ఉండటం, గుంటూరు కారం.. సైంధవ్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకోవడం… హనుమాన్ తప్పమరో సూపర్ హిట్ సినిమా లేకపోవడం..25 వరకు వేరే సినిమాలు రిలీజ్ లాక్ చేసుకోపోవడం.. ఇవన్నీ కూడా నా సామిరంగా కి కొంచెం అచ్చి వచ్చేలానే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా కాదన్నా నాగార్జున చిత్రం 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.
విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter