Bigg Boss Season 8: బిగ్ బాస్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.  ఎప్పటికప్పుడు 14 లేదా అంతకంటే ఎక్కువ మంది కంటెస్టెంట్లను దాదాపు 105 రోజులపాటు బయట ప్రపంచానికి దూరంగా ఒకే గదిలో బంధించి ఉంచడమే బిగ్ బాస్. ఊహకందని మలుపులతో ప్రేక్షకులకు అదిరిపోయేలా మజాను అందిస్తూ.. ఇందులో ఎన్నడూ చూడని టాస్కులు, లవ్ ట్రాక్లు, రొమాన్స్, గొడవలు ఇలా ఎన్నో రకాల అంశాలతో జోడించబడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇందులో ఎనిమిదవ సీజన్ కూడా మొదలుపెట్టేశారు. మొదటి ఎలిమినేషన్ కూడా ఈ వారమే జరిగిపోయింది. దీంతో తెలుగు బిగ్ బాస్ షోలో చెత్త రికార్డుగా నమోదయింది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


గత సీజన్ ను మించిన రేటింగ్ రాబట్టాలన్న లక్ష్యంతోనే అన్ లిమిటెడ్ అనే కాన్సెప్ట్ తో సెప్టెంబర్ 1వ తేదీన 8వ సీజన్ ను మొదలుపెట్టారు. ఎప్పుడు చూడని సర్ప్రైజ్లు,  టాస్క్ లు, ట్విస్ట్ లతో కూడిన కంటెంట్ ను  ప్రసారం చేస్తున్నారు. ఇక మొదటివారం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో ఆరుగురు నామినేట్ కాగా అందులో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. 


ఇకపోతే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఓటీటీ వెర్షన్ మినహా ఇప్పటి వరకు లేడీ కంటెస్టెంట్లు ఎవరూ కూడా విన్నర్ గా నిలవలేదు. నిన్నటి ఎపిసోడ్ వరకు కూడా మొత్తం ఎనిమిది సీజన్లలో మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే మొత్తం ఆరుగురు లేడీ కంటెస్టెంట్లే మొదటివారం ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ షోలో ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతోందనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. 


ఇక మొదటి సీజన్లో మొదటివారం జ్యోతి,  రెండో సీజన్లో మోడల్ సంజన, మూడో సీజన్లో నటి హేమ, ఐదవ సీజన్లో సరయు రాయ్, ఏడవ సీజన్లో కిరణ్ రాథోడ్, ఎనిమిదవ సీజన్లో బేబక్క ఇలా ఎనిమిది సీజన్లలో తొలి వారం కంప్లీట్ అయితే అందులో ఆరు మంది మహిళలే ఎలిమినేట్ అవ్వడం వారికి ఇక్కడ అన్యాయం జరుగుతోంది అనడానికి చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. 


ఇండియాలో ఎన్నో భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో  ఒక్క తెలుగులో మాత్రమే మొదటి వారంలో ఎక్కువ మంది లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. దీంతో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయాలని చాలామంది డిమాండ్లు చేస్తున్నారు.


Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..


Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.