Nagarjuna to involve in Akhil’s Movies: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం అంటే ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి దారుణమైన రివ్యూలు బయటికి రావడంతో సినిమా చూసేందుకు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఏజెంట్ సినిమా అఖిల్ కెరియర్ లో 5వ సినిమా. ఇక ముందుగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాతో కాస్త బయటపడ్డాడు అనుకునే లోపు ఏజెంట్ తో మరో భారీ స్ట్రోక్ తగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి నాగార్జున ఈ ఏజెంట్ సినిమా విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదని తెలుస్తోంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి రేసుగుర్రం, కిక్ లాంటి హిట్ సినిమాలు అందించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆయన మీద పూర్తిగా బాధ్యత వదిలేసి నాగార్జున ఏమాత్రం సినిమా మేకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు సినిమా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత అనిల్ సుంకర కూడా సరైన స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకు వెళ్లడం తమ తప్పేనని ఒప్పుకున్నారు.


Also Read: Sarath Babu Death: శరత్ బాబు మృతి అంటూ ప్రచారం.. 'చంపకండి' అంటున్న నటుడి సోదరి!


ఈ నేపథ్యంలోనే నాగార్జున అఖిల్ కెరియర్లో సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి అఖిల్ హీరోగా లాంచ్ అయ్యి ఏడేళ్లు అవుతోంది, అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓ మాదిరిగా ఆడిన మిగతా సినిమాలు ఏవీ ఆయనకు కలిసి రాలేదు. మరోపక్క నాగార్జున సినిమాలు కూడా అంతగా ఏమీ వర్కౌట్ అవ్వడం లేదు. ఈ నేపద్యంలో కొడుకు మీద దృష్టి పెడితే ఆయన ఫ్యూచర్ బాగుంటుందని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది.


చివరిగా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున మరో సినిమాని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కానీ ఆ విషయం మీద అధికారిక ప్రకటన అయితే లేదు. మరోపక్క అఖిల్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడని, కొత్త దర్శకుడితో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ క్రమంలో నాగార్జున, అఖిల్ చేస్తున్న సినిమాకి సంబంధించి అన్ని విషయాలలోనూ ఇన్వాల్వ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


Also Read: Samantha Tattoos:చైతూతో విడిపోయినా దాన్ని వదలని సమంత..అలా బయట పడిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook