Nagumomu Tharale Video Song: డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'.. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్లలో మిశ్రమ దక్కించుకున్న ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడీ సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలోని 'నగుమోము తారలే' వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌- పూజా హెగ్డే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కృష్ణకాంత్‌ రచించిన ఈ మెలొడి సాంగ్ ను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటకు మ్యూజిక్ ను అందించారు. 



1970 నాటి ఇటలీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ లవ్ థ్రిల్లర్ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించారు. ఆయన ప్రేమించే అమ్మాయి ప్రేరణగా పూజా హెగ్డే నటనతో మెప్పించారు. యువీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.  


Also Read: Samyuktha Menon Photos: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న 'భీమ్లానాయక్' హీరోయిన్!


Also Read: Krithi Shetty Photos: చీరకట్టులో మతిపోగొడుతున్న 'ఉప్పెన' బ్యూటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook