Nandamuri Balakrishna : అనిల్ రావిపూడి-బాలయ్య ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ న్యూస్
Nandamuri Balakrishna NBK 108 నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేయబోతోన్నాడు.
Nandamuri Balakrishna NBK 108 : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అఖండ తరువాత బాలయ్య జోరు మరింతగా పెరిగింది. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాలయ్య మార్కెట్ కూడా పెరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయినా, టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా కూడా అఖండ మంచి వసూళ్లను రాబట్టింది. అలా అఖండతో బాలయ్యకు మళ్లీ ఊపిరి వచ్చినట్టు అయింది. బాలయ్య సినిమాలకు మళ్లీ ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
అంతేకాకుండా బాలయ్య తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు పదిహేను కోట్ల వరకు బాలయ్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టైటిల్ టీజర్, జై బాలయ్య పాట మంచి స్పందనతో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది.
బాలయ్యతో అనిల్ రావిపూడి ఓ సినిమాను రెడీ చేశాడు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. బాలయ్యతో అనిల్ చేయబోతోన్న NBK 108 ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలే అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 3 ఓ మోస్తరుగా ఆడింది. వచ్చిన టాక్‌కు చెప్పిన కలెక్షన్లకు తేడా లేదని జనాలు కూడా కౌంటర్లు వేసేశారు. మరి బాలయ్యతో అనిల్ రావిపూడి తన సత్తాను చాటుతాడా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook