Vakkantham Vamsi Nithin Movie : ఎట్టకేలకు వక్కంతం వంశీకి చాన్స్.. అన్నీ నెగెటివ్ సెంటిమెంట్లే.. వర్కౌట్ అయ్యేనా?

Vakkantham Vamsi Nithin Movie వక్కంతం వంశీకి దర్శకుడిగా చాన్స్ చాలా ఆలస్యంగా వచ్చింది. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని తీశాడు. అది దారుణంగా బెడిసి కొట్టేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 10:07 AM IST
  • వక్కంతం వంశీకి ఇంకో చాన్స్
  • నితిన్‌ కొత్త చిత్రం షురూ
  • హారిస్ జయరాజ్ సంగీతం
Vakkantham Vamsi Nithin Movie : ఎట్టకేలకు వక్కంతం వంశీకి చాన్స్.. అన్నీ నెగెటివ్ సెంటిమెంట్లే.. వర్కౌట్ అయ్యేనా?

Vakkantham Vamsi Nithin Movie కొందరు రచయితలుగానే సక్సెస్ అవుతారు.. ఇంకొందరికి దర్వకత్వం మీద మాత్రమే పట్టు ఉంటుంది. అలా రచయిత, దర్శకుడిగా సక్సెస్ అయిన వాళ్లు చాలా కొద్ది మందే ఉంటారు. త్రివిక్రమ్ అయితే కెరీర్ ప్రారంభంలో రైటర్‌గా ఉన్నాడు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టేసుకున్నాడు. ఇప్పుడు త్రిమిక్రమ్ టాప్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. కొరటాల శివ సైతం మంచి రైటర్. మంచి డైరెక్టర్.

వక్కంతం వంశీ సైతం ఎన్నో మంచి కథలను అందించాడు. రైటర్‌గా సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నా పేరు సూర్య సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ కోసం రాసుకున్న ఈ కథ చివరకు బన్నీ వద్దకు వెళ్లిందట. బన్నీ కూడా ఎంతో ఇష్టంగానే ఈ సినిమా చేశాడట. కానీ సినిమా మాత్రం తేలిపోయింది. అయితే మళ్లీ రెండో చాన్స్ రావడానికి చాలా కాలమే పట్టింది.

దర్శకుడిగా వక్కంతం వంశీ రెండో చిత్రాన్ని ప్రారంభించేశాడు. అది కూడా నితిన్‌తో. అసలు ఇప్పుడు నితిన్ ఫ్లాపులతో ఉన్నాడు. చివరగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాకు డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి నితిన్, వక్కంతం వంశీ కలిసి వస్తున్నారంటే మినిమం బజ్ కూడా ఉండదు. ఇది కాకుండా హారిస్ జయరాస్ సంగీతం అనేది నెగెటివ్ సెంటిమెంట్. ఆయన సంగీతం అందించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన దాఖలాలు లేవు.

ఇలా ఈ సినిమాకు అన్నీ నెగెటివ్ సెంటిమెంట్లే ఉన్నాయి. ఇక ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ సైన్ ఏంటంటే.. హీరోయిన్ శ్రీలీల.ఆమె నటించిన మొదటి చిత్రం పర్వాలేదనిపించింది. రాఘవేంద్ర రావు పెళ్లి సందD సినిమాతో శ్రీ లీల టాలీవుడ్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమెకు మంచి క్రేజ్ ఉంది. మరి ఈమె లక్ ఫ్యాక్టర్ ఈ చిత్రానికి కలిసి వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

Also Read : Chiranjeevi Waltair Veerayya : విదేశాలకు వీరయ్య.. హీరోయిన్‌తో మెగాస్టార్ రొమాన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News