Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

Bigg Boss 6 Telugu Winner బిగ్ బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరన్నది ఎప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అందరూ వేస్టే అని అనుకున్నా.. అందులో కొంత బెటర్ కంటెస్టెంట్ మాత్రం రేవంత్. సో అతనే విన్నర్ అని అంతా అనుకునేవారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 08:26 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం
  • కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్లు
  • శివ బాలాజీ, ప్రభాకర్ కామెంట్స్ వైరల్
Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ

Bigg Boss Telugu 6 Winner Revanth : బిగ్ బాస్ ఇంట్లో రేవంత్ విన్నర్ అవుతాడు అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లు పరోక్షంగానూ కన్ఫామ్ చేసేశారు. అసలే ఈ సీజన్ చెత్తగా సాగుతోందని, ఏ ఒక్కరూ పర్ఫెక్ట్‌గా లేరని, షో వేస్ట్ అని అనుకున్నారు. మొదటి నాలుగైదు వారాలు అయితే మరీ దారుణంగా నడిచింది. గీతూ మీద నెగిటివ్ వచ్చినా.. ఆమెను తిట్టుకునేందుకు అయినా షోను చూస్తూ వచ్చారు. ఇక మొదటి నుంచి రేవంత్ మాత్రం ఒకే టెంపోను మెయింటైన్ చేస్తూనే వచ్చాడు.

రేవంత్ నోటి దురుసు కాస్త పక్కన పెడితే.. మిగతా వాటిలో ది బెస్ట్‌గా ఉంటాడు. ఆట బాగా ఆడేస్తుంటాడు. తెలివితో కాకుండా బలంతోనే ఆట ఆడేస్తుంటాడు. ఆటల్లో రేవంత్‌ను ఢీ కొట్టడం ఈ సీజన్లో ఎవరి వల్లా కాలేదు. అలా అని అన్ని టాస్కులు గెలిచాడా? అంటూ చెప్పడం కష్టం. రేవంత్, రోహిత్ కలిసి వంద రన్స్ చేయాల్సిన టాస్కులో ఓడిపోయారు. ఓడిపోయి రోహిత్ మీద నెట్టే ప్రయత్నం చేశాడు. ఇలా కొన్ని నెగెటివ్స్ కూడా రేవంత్‌లో ఉన్నాయి.

అయినా కూడా రేవంత్‌ విన్నర్ అయ్యేందుకే ఎక్కువగా అవకాశాలున్నాయి. రేవంత్‌కు ఆల్రెడీ బయట ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో రేవంత్ గెలుస్తాడని అందరికీ అర్థమైంది. పైగా నిన్న స్టేజ్ మీదకు వచ్చిన వారంతా కూడా రేవంత్ మాత్రమే కాంపిటీషన్ అని ముక్తకంఠంతో చెప్పేశారు. ఇక శివ బాలాజీ, ప్రభాకర్ వంటి వారైతే.. రేవంత్‌ను కొట్టేస్తే, గెలిస్తే.. బిగ్ బాస్ టైటిల్ గెలిచినట్టే అని అన్నారు. అంటే ఆల్రెడీ రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అయిపోయినట్టుగానే చెప్పేశారు. 

రానున్న మూడు వారాల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఈ టైటిల్ రేసులో శ్రీహాన్, ఆదిరెడ్డి కూడా ఉంటారు. మరి ఒక వేళ ఈ మూడు వారాల్లో ఏదైనా మ్యాజిక్ జరిగితే.. ఈ ఇద్దరికి కూడా బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. ఇనయ అయితే టాప్ 5లోకి వచ్చింది. కానీ విన్నర్ మెటిరీయల్ అయితే కాదనిపిస్తోంది. ఫైమా కూడా అంతే. టాప్ 5 వరకు వస్తుందేమో గానీ విన్నర్ అయితే అవలేదనిస్తోంది.

Also Read : Mahesh Babu Nani : ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది.. మహేష్‌ బాబు నాని సినిమాపై ఎస్ జే సూర్య

Also Read : Bigg Boss Elimination : బిగ్ బాస్ ఎలిమినేషన్.. పాపం ఫైమా.. ఇరుకున పెట్టేస్తారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News