Unstoppable Season 2 Promo: ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు అన్‌స్టాపబుల్ సీజన్-2 షోతో నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. మొదటి ఎపిసోడ్‌కు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గెస్టులుగా రావడంతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్‌తో ఈ ఎపిసోడ్ దూసుకుపోతుంది. బాలయ్యతో చంద్రబాబు, లోకేష్ సంభాషించిన తీరు అటు సినీ వర్గాల్లో.. ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా రెండో ఎపిసోడ్ సెకెండ్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ గెస్టులుగా వచ్చారు. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో మూవీ లవర్స్‌కు తెగ నచ్చేయగా..రెండో ప్రోమో ఎమోషనల్‌గా కట్ చేశారు. 


జీవితంలో జరిగిన పెద్ద అవమానం ఏంటని డీజే టిల్లు మూవీ హీరో సిద్దును బాలయ్య అడిగారు.  తాను హీరోగా చేద్దామని అనుకుంటున్నానని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి చెప్తే.. 'ఈ ముఖంతోనే హీరో అయిపోదామని అనుంటున్నావా..?' అని అవమానించారని చెబుతూ సిద్దు ఎమోషనల్ అయ్యాడు. సిద్దు చెబుతున్న మాటలు విన్న బాలయ్య కళ్లు చెమ్మగిల్లాయి. తనకు వస్తున్నాయి కన్నీళ్లు అని ఆయన అన్నారు. 'నువ్వు అక్కడితో ఆపేసి ఇటు రామ్మా' అంటూ సిద్దును గుండెలకు హత్తుకున్నారు. 



ఆ తరువాత బిగ్ ట్రబుల్ గురించి చెప్పాలని విశ్వక్ సేన్‌ను అడిగారు బాలయ్య. తన సిస్టర్ ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు తానుపడ్డ ఎదుర్కొన్న కష్టాలను గురించి చెప్పుకుని ఎమోషనల్ అయ్యాడు. నేను డైరెక్ట్‌ చేస్తూ.. దమ్కీ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నా.. మొన్న ప్రొడ్యూసర్స్ స్ట్రైక్ అది ఇది అంటున్నారు. స్టైక్ అయిపోయే సమయానికి మా సిస్టర్ హస్పిటల్‌లో ఉన్నారు. ఐదారు రోజులు రాత్రి 2 గంటల వరకు హస్పిటల్‌లో ఉండడం.. పొద్దున్నే ఆరు గంటలకు సెట్‌కు వెళ్లిపోయేవాడిని. కట్ చెప్పాగానే మానిటర్ దగ్గరకు వెళ్లి ఏడ్చుకుంటు కూర్చున్నా..' అంటూ విశ్వక్ సేన్ తన జీవితంలో బిగ్ ట్రబుల్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రోమో వైరల్ అవుతుండగా.. పూర్తి ఎపిసోడ్ ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.


Also Read: T20 World Cup 2022: భారత్‌పై విధ్వంసం సృష్టించిన ప్లేయర్ వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ.. ఇక బాదుడే బాదుడు


Also Read: CM Jagan Mohan Reddy: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ మాస్ కౌంటర్.. ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి