Nandamuri Balakrishna Gopichand Malineni Movie plot twist revealed: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ 107వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాల పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే దునియా విజయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ నిమిత్తం సినిమా యూనిట్ అంతా టర్కీ వెళ్లబోతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ ప్లాట్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ మొత్తం ఒక లేడీ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఉన్న ప్లేట్ ట్విస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.


నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే గోపీచంద్ మలినేని కూడా క్రాక్ హిట్తో ఫామ్ లో ఉన్నారు. అలాగే ఈ సినిమా ఒక పూర్తిస్థాయి ఫ్యాక్షన్ డ్రామాగా రుపొందుతున్న నైపద్యంలో ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు.


తన కెరియర్లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని ఒక కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో 50 ఏళ్ల ఒక వ్యక్తిగా నందమూరి బాలకృష్ణ తన నిజ జీవిత పాత్రను పోలి ఉండే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కుమార్తెగా హీరోయిన్ శ్రీ లీల నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజా నిజాలు ఏమేం ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Also Read: Balakrishna Worst Movies: బాలకృష్ణ ఖాతాలో కొత్త రికార్డు.. టాప్ టెన్ చెత్త సినిమాల్లో నాలుగు బాలయ్యవే!


Also Read: SSMBxSitaraForDIDTelugu: జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ లో మహేష్ సందడి.. సితార కూడా వచ్చేసిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి