Balakrishna Worst Movies: బాలకృష్ణ ఖాతాలో కొత్త రికార్డు.. టాప్ టెన్ చెత్త సినిమాల్లో నాలుగు బాలయ్యవే!

Balakrishna Has 4 Films Out Of Top 10 Worst Rated Telugu Films on IMDB: బాలకృష్ణ పేరిట ఒక చెత్త రికార్డు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 10:32 PM IST
Balakrishna Worst Movies: బాలకృష్ణ ఖాతాలో కొత్త రికార్డు.. టాప్ టెన్ చెత్త సినిమాల్లో నాలుగు బాలయ్యవే!

Balakrishna Has 4 Films Out Of Top 10 Worst Rated Telugu Films on IMDB: నందమూరి హీరో బాలకృష్ణ పేరిట ఒక చెత్త రికార్డు ఉందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల విడుదలైన లైగర్ సినిమాకి ఐఎండీబీ అంటే ఇండియన్ మూవీ డేటాబేస్ వెబ్సైట్ లో కేవలం త్రీ రేటింగ్ వచ్చింది. ఇటీవల విడుదలై డిజాస్టర్ గా నిలిచిన ది లెజెండ్ సినిమా కంటే తక్కువ ఐఎండీబీ రేటింగ్ లైగర్ కు వచ్చిందన్న వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.

అయితే అసలు టాప్ టెన్ వరస్ట్ రేటింగ్ సినిమాల మీద ఒక లుక్కు వేస్తే అందులో నందమూరి బాలకృష్ణ నటించిన నాలుగు సినిమాలు ఉండడం ఆసక్తికరంగా మారింది. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఒక్క మగాడు సినిమా 1.8 రేటింగ్ తెచ్చుకోగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాకి కూడా అంతే రేటింగ్ వచ్చింది. ఇక తోటపల్లి మధు కదా అందించగా పి వాసు దర్శకత్వం వహించిన మహారధి సినిమాకి కూడా 2 రేటింగ్ వచ్చింది.

అలాగే విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే అందించగా స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన విజయేంద్ర వర్మ సినిమాకి కూడా 2 రేటింగ్ రావడం ఆసక్తికరంగా మారింది. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఎన్ని డిజాస్టర్ సినిమాలు వచ్చినా బాలకృష్ణ ఒక్క హిట్టు కొడితే అవన్నీ లెక్కలోకి కూడా రావని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి క్రేజ్ కేవలం నందమూరి బాలకృష్ణకే సాధ్యం అంటూ వారు పేర్కొంటున్నారు.  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి గోపీచంద్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.

ఆయన కెరియర్లో 107వ సినిమాగా చెబుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయి ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన కుమార్తెగా హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గెట్ రెడీ!

Also Read: Vijay Deverakonda Fans: సమంతపైనే లైగర్ ఫ్యాన్స్ ఆశలు.. అంతా ఆమె చేతుల్లోనే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News