Nandamuri Balakrishna Helicopter Emergency Landing: నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒంగోలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన హెలికాప్టర్ వెనువెంటనే 15 నిమిషాలలో వెనక్కి వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో తృటిలో పెను ప్రమాదం తప్పిందని బాలకృష్ణ సహ శృతిహాసన్ అలాగే సినిమా యూనిట్ కు చెందిన మరి కొంత మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవారని ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం నాడు ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు బాలకృష్ణ శృతిహాసన్ మరికొంతమంది యూనిట్ సభ్యులు బయలుదేరారు. అయితే బయలుదేరిన కొద్దిసేపటికి అంటే 15 నిమిషాల్లో మళ్ళీ హెలికాప్టర్ వెనక్కి రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే  బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే వెనక్కి వచ్చారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది నిజం కాదని హెలికాప్టర్ పైలెట్ క్లారిటీ ఇచ్చారు.


హెలికాప్టర్ లో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని హైదరాబాదుకు ప్రయాణించే మార్గం మొత్తం పొగ మంచుతో ఉండడంతో వెనక్కి తిరిగి వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు ప్రయాణించే మార్గం క్లియరెన్స్ లేకపోవడం వల్ల వెను తిరిగి వచ్చామని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నామని ఆ క్లియరెన్స్ రాగానే ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్తామని పేర్కొన్నారు.


ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహారెడ్డి ఈ సినిమాకి క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు, తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆసక్తికరంగా సాగింది. అలాగే ఈ ఈవెంట్ లో విడుదల చేసిన సినిమా ట్రైలర్ కూడా సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. 


Also Read: Ramya Raghupathi : దేవుడి లాంటి కృష్ణ గారితో అక్రమ సంబంధం అంతకట్టాడు.. అన్నతో అలా అంటూ రమ్య రఘుపతి సంచలనం!


Also Read: Suchitra Chandrabose Father: టాలీవుడ్లో విషాదం.. చంద్రబోస్ మామ కన్నుమూత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook