Suchitra Chandrabose Father Chand Basha passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు సినీ ఆర్టిస్టులను, సూపర్ స్టార్ లను, టెక్నీషియన్లను దూరం చేసుకున్న తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో సంగీత దర్శకుడిని దూరం చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మామ, ఆయన భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా నిన్న రాత్రి హైదరాబాద్ మణికొండలోని స్వగృహంలో మృతి చెందారు.
చాంద్ బాషా వయసు 92 సంవత్సరాలు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగులో ఖడ్గ తిక్కన, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు వంటి సినిమాలు చేయగా కన్నడంలో అమర భారతి, చేడిన కిడికి కన్నడ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
చాంద్ బాషాకి నలుగురు సంతానం కాగా వారిలో ముగ్గురు కుమార్తెలు, మరొకరు కుమారుడు ఉన్నారు. సుచిత్రా చంద్రబోస్ తెలుగులో కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా అందరికీ పరిచితమే. ఆమె సినీ గేయ రచయిత చంద్రబోస్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆఖరిపోరాటం అనే సినిమాతో డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారిన ఆమె అనేక సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి పేరు సంపాదించారు.
అయితే 2004లో పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమాకి ఆమె దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. ఇక ఒకరోజు సంజీవయ్య పార్కులో చంద్రబోస్ షూటింగ్ చూడడానికి వెళ్లడంతో అక్కడ సుచిత్రను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని చెబుతూ ఉంటారు. ఇక చంద్రబోస్ ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ లిరిక్ రైటర్ గా కొనసాగుతున్నారు. అనేక స్టార్ హీరోల సినిమాలకు ఆయన లిరిక్స్ అందిస్తూ వస్తున్నారు.
Also Read: Nagababu Counter: రోజా, నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook