Nandamuri Balakrishna NBK 107 Video Leaked: నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ హిట్టు అందుకున్నారు. చాలా కాలం పాటు ఎలాంటి హిట్ లేక ఇబ్బందులు పడిన ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో రూపొందిన అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద అటు ప్రేక్షకులతో పాటు ఇటు బాలకృష్ణ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది తాజాగా ఈ టర్కీ షూటింగ్ నుంచి ఒక వీడియో లీకై బయటకు వచ్చింది. ఆ లీక్ అయిన వీడియోలో నందమూరి బాలకృష్ణ బ్లాక్ షర్ట్ తెల్ల పంచె కట్టుకొని దుండగులతో పోరాడుతున్నట్లు కత్తితో వారికి వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పూర్తిస్థాయి ఫ్యాక్షన్ సినిమాగా కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ టర్కీలో ఇలా పంచెలతో చేయడం మీద కూడా కాస్త భిన్న స్పందన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే మాములుగా ఇలా పంచెలతో ఫైట్లు మన దేశంలో ఓకే కానీ ఇలా వేరే దేశాల్లో పంచెలతో ఫైట్లు ఏమిటో మేకర్స్ కే తెలియాలి. బహుశా దాన్ని ఇండియాలోనే జరిగినట్టు ఏమైనా కలరింగ్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది. 



Nandamuri Balakrishna NBK 107 Turkey Schedule Wrapped: ఆ సంగతి అలా ఉంచితే ఇప్పటికే టర్కీలో సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో యూనిట్ అంతా ఇస్తాంబుల్ నుంచి దుబాయ్ వెళుతున్నారని, దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది. హైదరాబాద్ చేరుకున్న వెంటనే నందమూరి బాలకృష్ణ అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బీకే  సీజన్ 2 ప్రోమో షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.


 


అయితే ప్రోమో షూటింగ్ తో పాటు ఎన్బీకే యాంథం అంటూ ఒక సాంగ్ కూడా షూట్ చేయడానికి నిర్వాహకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సాంగ్ షూట్ జరుగుతుందా? లేదా? అనేది బాలకృష్ణ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో నటిస్తున్నారు.


అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాని హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మునుపెన్నడు కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు.


Also Read : Ponniyin Selvan Record Opening: ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతున్న పోన్నియన్ సెల్వన్?


Also Read : Bimbisara Girl in God Father: బింబిసారకి గాడ్ ఫాదర్ కి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook