Nandamuri Balakrishna: బాలకృష్ణపై భూ ఆక్రమణ కేసు పెట్టాలి.. మరీ ఇంత నిర్లక్ష్యమా?
Nandamuri Balakrishna Road Encroachment: నందమూరి బాలకృష్ణ జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే, అయితే ఆయన నివాసం ఉన్న ప్రదేశములో సర్కారు స్థలం ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి.
Nandamuri Balakrishna Road Encroachment at Jubilee Hills: నందమూరి బాలకృష్ణ నివాసం విషయంలో భూ ఆక్రమణ ఒక సోషల్ యాక్టివిస్ట్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు, జిహెచ్ఎంసి మేయర్ సహా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులను కొంతమందిని టాగ్ చేస్తూ సోషల్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలకృష్ణ నివాసం బయట ఉన్న ఫుట్పాత్ ను ఆక్రమించి ఆయన కొన్ని మొక్కలు పెంచడమే కాక ప్రైవేట్ జనరేటర్ కూడా అక్కడే పెట్టారని వాటన్నింటికీ ఒక ఫెన్స్ లాగా వేసి పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాపర్టీగా వాడుతున్నారంటూ పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 9వ తేదీ ఉదయం ఈ మేరకు ఆన్లైన్ యాప్ ద్వారా పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
బాలకృష్ణ పేవ్ మెంట్ ఆక్రమణ చేశారని ఆరడుగులు ఉండాల్సిన ఫుట్పాత్ లో కేవలం రెండడుగులు మాత్రమే వదిలారని మిగతా నాలుగు అడుగులలో మొక్కలు పెంచి ప్రైవేట్ జనరేటర్ పెట్టుకున్నారని వాటన్నింటికీ బారికేడ్ కూడా పెట్టారని కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అతను చేసిన ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఫిర్యాదును స్వీకరించి రిజాల్వ్ చేసినట్లుగా యాప్ లో చూపిస్తుందని, ఇలాంటి యాప్స్ ఎందుకు పెడుతున్నారు? జనాలను ఫూల్స్ ని చేయడానికేనా ? అంటూ విజయ గోపాల్ ఒక పోస్టులో మళ్ళీ ప్రశ్నించారు.
ప్రజలు ఏవైనా ఇల్లీగల్ వ్యవహారాలు జరిగితే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు వాటి మీద చర్యలు తీసుకుంటేనే జనానికి నమ్మకం వస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకున్నామని చెబుతూ కేసు క్లోజ్ చేయడం ఏమాత్రం బాలేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బిజీ రోడ్లమీద ఆ పేవ్మెంట్ ఆక్రమణ నేపథ్యంలో పాదచారుల సేఫ్టీ చాలా ముఖ్యమని ఇలా చేసినందుకు నందమూరి బాలకృష్ణ మీద భూ ఆక్రమణ చట్టం కింద కేసు కూడా నమోదు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Kalpika Ganesh: నన్ను కెలుకుతున్నావ్ ధన్య, నీ పవర్ చూపించావ్ గా నా పవర్ చూపిస్తే మాడిపోతావ్!
Also Read: Ranga Marthanda : చిరు నోట రంగమార్తాండ కవితాఝరి.. అప్డేట్ ఇచ్చిన కృష్ణవంశీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook