Kalpika Ganesh Gives warning to Dhanya Balakrishna: ఈ మధ్యకాలంలో కల్పిక గణేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించిన కల్పిక గణేష్ అప్పటినుంచి మీడియా ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఆమె తన సహచర నటీనటులను ఇద్దరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది.
ఇప్పటికే అభినవ్ గోమతం అనే ఒక కమెడియన్ మీద అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడు తన సహచర నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్య బాలకృష్ణ తమిళ అమ్మాయైనా తెలుగులో అనేక సినిమాలు చేసింది. సెవెంత్ సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక సహా అనేక వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. తాజాగా ధన్య బాలకృష్ణ గురించి సంచలన విషయం బయటపెట్టింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో రివిల్ చేస్తూ కల్పిక వీడియో పెట్టడంతో యూట్యూబ్ తాజాగా ఆ వీడియోని డిలీట్ చేయించింది.
ఇక డిలీట్ చేసిన వీడియోలో కల్పిక గణేష్ మాట్లాడుతూ ధన్య బాలకృష్ణ డైరెక్టర్ బాలాజీ మోహన్ ని ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. నిజానికి ముందు నుంచి ఆమె చెన్నై వెళ్ళినప్పుడు బాలాజీ మోహన్ తోనే ఉండేది, అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడని తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఆమెకు బాలాజీతో పరిచయమైందని చెప్పుకొచ్చారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టారని మీరిద్దరికీ సీక్రెట్ గా పెళ్లి అయి ఏడాది గడుస్తోంది. అయినప్పటికీ తమ రిలేషన్ వారు బయట చెప్పేందుకు ఇష్టపడటం లేదని ఆమె పేర్కొంది.
అయితే వారి పెళ్లి గురించి తెలిసి ధన్య విషయంలో నాకు భయం వేసింది, బాలాజీ ఆమెను టార్చర్ పెడతాడేమో అని అనుకున్నా కానీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు తెలిసిందని ఆమె పేర్కొండియూ. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఒక కారణం ఉందని పేర్కొన్న ఆమె ధన్య ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కి రావడం లేదు, ఈ విషయంలో బాలాజీ ఏమని ఇబ్బంది పెడుతున్నాడేమో అనిపించింది అని, అందుకే ఈ విషయాన్ని బయట పెట్టానని ఆమె పేర్కొంది. అయితే ధన్య కంప్లైంట్ చేసిందో లేక యూట్యూబ్ ఛానల్ లో వేరే ఎవరైనా కంప్లైంట్ చేశారో తెలియదు కానీ ఈ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేయడంతో డైరెక్టర్ బాలాజీ ఈ వీడియో డిలీట్ చేయించారని ఆరోపిస్తూ కల్పిక గణేష్ ఇప్పుడు మరోసారి ఆరోపణలు చేసింది.
అయితే ఇదే విషయం మీద మరోసారి కల్పిక గణేష్ మాట్లాడుతూ ధన్య తనను వివాదంలోకి లాగుతుందని నన్ను వివాదంలోకి లాగుతున్నావు సరే త్వరలో కోర్టులో కలుసుకుందాం, నీ గురించి ఎన్నో విషయాలు బయట పెట్టేసరికి ఇన్నాళ్లు నన్ను బ్లాక్ చేసిన నువ్వు రాత్రి అన్లాక్ చేసి వరుస కాల్స్ చేశావు, భయపడ్డావా ?లేదా నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా సరే ఏం చేసుకుంటావో చేసుకో నీతో కూర్చుని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కానీ క్షమాపణలు చెప్పను అని ఆరోపించింది.
అలాగే అవకాశాలు కూడా వద్దు ఎందుకంటే నేను అనుకోకుండా యాక్టర్ అయ్యాను ఇది కాకపోతే వేరే పనులు చేసుకుంటూ నీఉంటానని పేర్కొంది. నీ పవర్ చూపించి నేను షేర్ చేసిన వీడియోని డిలీట్ చేశావు కదా నా పవర్ చూపిస్తే భస్మం అయిపోతారు అంటూ కల్పిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read: Ormax popular Stars: తెలుగులో టాప్ హీరో ఆయనే.. ఇన్ని నెలల తరువాత కూడా అదే జోరు!
Also Read: Ormax popular Stars: మార్కెట్లో మెంటలెక్కిస్తున్న సమంత క్రేజ్.. మరోమారు టాప్ హీరోయిన్ గా ఎంపిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook