Suguna Sundari Lyrical Video నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పోటిగా దిగుతోంది. అయితే ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఏ చిన్న అప్డేట్ అయినా కూడా చిరంజీవి, బాలయ్యల మధ్య పోల్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీర సింహా రెడ్డి చిత్రం నుంచి మాస్ ఆంథమ్ అంటూ జై బాలయ్య పాటను ఇది వరకే విడుదల చేశారు. ఈ పాట అచ్చం ఒసేయ్ రాములమ్మ పాటకు కాపీలా ఉండటంతో జనాలు ట్రోలింగ్ చేసి వదిలి పెట్టేశారు. తమన్ ఇచ్చిన ఈ కాపీ ట్యూన్‌ను జనాలు తిరస్కరించినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు సుగుణ సుందరి అంటూ బాలయ్య దుమ్ములేపేశాడు.


 



ఏయ్ మామ అంటూ బాలయ్య ఈ పాటలో స్టెప్పులు అదరగొట్టేశాడు. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. బాలయ్య ఎనర్జీ లెవెల్ అదుర్స్.. శేఖర్ మాస్టర్ దుమ్ములేపేశాడు.. అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేశారంటూ నందమూరి ఫ్యాన్స్ సంబరపడుతున్నాడు. ఇక ఇందులో బాలయ్య చిందులు ఎంతలా హైలెట్ అవుతున్నాయో.. శ్రుతి హాసన్ అందాలు కూడా అంతే హైలెట్ అవుతున్నాయి.


ఇక ఇప్పుడు మళ్లీ పోటీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఈ సుగుణ సుందరికి పోటీగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మరో పాట రాబోతోంది. నిన్నే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ చిరంజీవి ఇచ్చేశాడు. నువ్ శ్రీదేవీ అయితే.. నేను చిరంజీవిని అంటూ సాగే పాటను అద్భుతమైన లొకేషన్లో షూట్ చేసినట్టు చిరు చెప్పేశాడు. మరి ఈ రెంటిలో ఏ పాట క్లిక్ అవుతుందో చూడాలి.


Also Read : Amardeep Chowdary Tejaswini Wedding : బుల్లితెర జంట పెళ్లి సందడి.. ఒక్కటైన అమర్ దీప్-తేజస్విని గౌడ


Also Read : Acharya Dharmasthali : ప్రభాస్-మారుతి సినిమా షూట్.. ఆచార్యకు పట్టిన గతే పడుతుందా?.. నెటిజన్ల కౌంటర్లు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook