Acharya Dharmasthali : ప్రభాస్-మారుతి సినిమా షూట్.. ఆచార్యకు పట్టిన గతే పడుతుందా?.. నెటిజన్ల కౌంటర్లు

Prabhas Maruthi Movie Shoot ప్రభాస్ మారుతి మూవీ డార్లింగ్ అభిమానులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అందరికీ తెలిసిందే. మారుతి లాంటివాడికి ప్రభాస్ చాన్స్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 09:22 AM IST
  • సైలెంట్‌గా ప్రభాస్ మారుతి మూవీ షూటింగ్
  • ఆచార్య ధర్మస్థలి సెట్‌లో ప్రభాస్ షూట్
  • సెంటిమెంట్ రిపీట్ అవుద్దా?నెటిజన్ల సెటైర్లు
Acharya Dharmasthali : ప్రభాస్-మారుతి సినిమా షూట్.. ఆచార్యకు పట్టిన గతే పడుతుందా?.. నెటిజన్ల కౌంటర్లు

Acharya Dharmasthali ప్రభాస్ లైనప్‌ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరపడిపోయే వారు. రాధే శ్యామ్ ఫ్లాప్ అయినా, ఆదిపురుష్‌ మీద ట్రోలింగ్ జరగుతున్నా.. సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలున్నాయని ధీమా వ్యక్తం చేసేవారు. కానీ మధ్యలో మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని ప్రకటించడంతో డార్లింగ్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానుల భయానికే ఈ సినిమా షూటింగ్ అప్డేట్లు గానీ, పూజా కార్యక్రమాలు గానీ అధికారికంగా ఎక్కడా ప్రారంభించలేదు.

అభిమానుల దెబ్బకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ను కూడా మార్చేసినట్టు తెలుస్తోంది. అసలు మారుతితో సినిమా తీస్తుండటం ప్రభాస్ అభిమానులకే మింగుడుపడటం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అన్నా అంటూ అభిమానులు నిరాశ నిస్పృహలో ఉన్నారు. అయితే ఇప్పుడు డార్లింగ్ అభిమానులను మరింతగా కుంగదీసే అప్డేట్ వచ్చింది.

ప్రభాస్ మారుతి సినిమా షూటింగ్ ప్రస్తుతం కోకాపేటలో వేసిన ధర్మస్థలి సెట్‌లో జరుగుతోందని తెలుస్తోంది. ఆచార్య కోసం వేసిన ధర్మస్థలి సెట్‌లోని ఓ ఇంట్లో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందనే అప్డేట్ బయటకు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన నెలకొంది. మళ్లీ ఆచార్య సెంటిమెంట్ రిపీట్ అవుద్దా? ఆచార్యకు పట్టిన గతే పడుతుందా? అంటూ ఆనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలే ప్రభాస్ మారుతి ప్రాజెక్ట్ మీద జనాలు పీకలదాక కోపంతో ఉన్నారు. ఒక వేళ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా పాతాళానికి తొక్కేస్తున్నారు. మారుతిని తిట్టే వారిలో డార్లింగ్ ఫ్యాన్సే ముందుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా షూటింగ్‌లు కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్

Also Read : Masooda Ott Release Date : మసూద ఓటీటీ అప్డేట్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News