Amardeep Chowdary Tejaswini Wedding : బుల్లితెర జంట పెళ్లి సందడి.. ఒక్కటైన అమర్ దీప్-తేజస్విని గౌడ

Amardeep Chowdary Marriage అమర్‌దీప్ చౌదరి, తేజస్విని గౌడ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. నెట్టింట్లో అమర్‌దీప్, తేజస్విని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లిలో బుల్లితెర తారలంతా కూడా సందడి చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 10:00 AM IST
  • ఒక్కటైన బుల్లితెర జంట
  • అమర్ దీప్, తేజస్వినిల వివాహాం
  • పెళ్లిలో బుల్లితెర తారల సందడి
Amardeep Chowdary Tejaswini Wedding : బుల్లితెర జంట పెళ్లి సందడి.. ఒక్కటైన అమర్ దీప్-తేజస్విని గౌడ

Amardeep Chowdary Tejaswini Gowda wedding బుల్లితెరపై సీరియల్స్‌లో జంటగా నటించే వారు.. కొన్ని సందర్భాల్లో ప్రేమలో పడి.. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోనూ జంటగా మారిపోతోంటారు. అలా బుల్లితెరపై ఎంతో మంది జంటలు పెళ్లి చేసుకుని రియల్ లైఫ్‌లో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మరో బుల్లితెర జంట పెళ్లి పీటలెక్కింది. జానకి కలగనలేదు సీరియల్‌తో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు అమర్ దీప్ చౌదరి. ఇక కేరాఫ్‌ అనసూయ సీరియల్‌తో తేజస్వీని గౌడ సైతం మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.

అమర్ దీప్ చౌదరి, తేజస్వినీలు ఇప్పుడు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. ఆగస్ట్ నెలలో ఈ ఇద్దరికీ బెంగళూరులో ఘనంగా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం అమర్ దీప్, తేజస్వినీలు సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. అమర్ దీప్ అయితే తన ప్రేమ కథలు చెబుతూ.. తమ ప్రేమకు అడ్డంకి ఏర్పర్చిన వాళ్లను లైవ్‌లోనే ఏకిపారేశాడు. అలాంటి ప్రేమ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

నిన్న ఈ జంటకు వివాహాం జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర తారలు హాజరయ్యారు. అమర్ దీప్ పెళ్లిలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ నటీమణులు సందడి చేశారు. ఆర్జే కాజల్, అరియానా వంటివారు అమర్ దీప్‌ను తెగ ఆటపట్టించేశారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అమర్ దీప్ పెళ్లిలో జానకి కలగనలేదు టీం అంతా కూడా సందడి చేసింది. మల్లిక పాత్రలో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ అయితే అమర్ దీప్‌కు సొంత అక్క కంటే  ఎక్కువే. నిశ్చితార్థంలోనే విష్ణు ప్రియ తెగ సందడి చేసింది. ఇక ఈ పెళ్లిలో ఆమె హడావిడే కనిపిచింది. ‘సిరిసిరిమువ్వ’, `ఉయ్యాల జంపాల`  సీరియల్స్‌తో అమర్ దీప్‌కు గుర్తింపు వచ్చినా కూడా.. జానకి కలగనలేదు సీరియల్‌తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు

Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్

Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News