Nandamuri Kalyan Ram Devil Movie Updates: బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని రేసులోకి దూసుకువచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. అమిగోస్ సినిమా నిరాశపరిచినా.. కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలతో మెప్పించాడు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్‌తో స్వాతంత్య్రానికి ముందు కథాంశంతో రూపొందుతోంది. ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్‌ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. న‌వంబ‌ర్ 24న ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో డిజైన్ చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ విస్సా మాట‌లు, స్క్రీన్ ప్లే, స్టోరీ అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 


'డెవిల్' మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం. ఈ సినిమాను 1940 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్లు సెట్స్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ చిత్రానికి సెట్స్ ను రూపొందించారు. బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్నసయమానికి చెందిన సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించినట్లు చెప్పారు. నిర్మాత అభిషేక్ నామాగారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్‌లో భారీ సెట్ వేసి సినిమా రిచ్‌గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. 


'డెవిల్' మూవీ కోసం వేసిన సెట్స్ .. వాటి విశేషాలు..
==> 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్
==> బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, ఒక వింటేజ్ కారు
==> బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
==> 1940 కాలానికి చెందిన కార్గో షిప్
==> 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)
==> ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను ఉపయోగించారు.