Devil Movie Collections Day 1: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) 'డెవిల్'(Devil Movie) సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీ మెుదటి షో పడినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు బింబిసార లెవల్లో అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ రాలేదు. తొలి రోజు డెవిల్ ప్రపంచవ్యాప్తంగా రూ.4.92 కోట్ల వ‌సూళ్ల‌ను రాబట్టింది. అప్పట్లో బింబిసారకు రూ.9 కోట్లు వరకు కలెక్షన్స్ వచ్చాయి. డెవిల్ సినిమా బాగున్నప్పటికీ.. థియేటర్లలో మరోపక్క ప్రభాస్ మేనియా కొనసాగుతుండటంతో అందరూ సలార్ కే వెళ్తున్నారు. అయితే వీకెండ్ లో ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రిలీజైన డెవిల్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. మూవీ మెుత్తం 1945 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తనపాత్ర మేరకు అద్భుతంగా నటించింది. మాళవిక నాయర్, ఏస్తర్, అజయ్, వశిష్ట, షఫీ, జబర్దస్త్ మహేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. డెవిల్ సినిమా  కథ, కథనాలు అన్నీ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీ నాటి కాలానికి తీసుకెళ్తుంది. మంచి సస్పెన్స్ మెయింటైన్ చేసి థ్రిల్లింగ్ గా చూపించారు. సుభాష్ చంద్రబోస్ స్టోరీని ఈ చిత్రానికి లింక్ చేయడం, దానిని మలిచిన విధానం బాగుంది. హర్ష వర్ణన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. 


Also Read: Devil 2: డెవిల్ సీక్వెల్.. రెండు కాలాలకు సంబంధించిన కథ..ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన కళ్యాణ్ రామ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter