Devil Movie First Single Promo Released: నందమూరి  కళ్యాణ్‌ రామ్‌ నయా మూవీ 'డెవిల్'(Devil Movie). నవీన్‌ మేడారం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ యెుక్క అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. మాయే చేశావే అంటూ సాగే ఈ సాంగ్ ను హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచగా.. సిద్ శ్రీరామ్ అలపించారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 19న రిలీజ్‌ చేయనున్నట్లు  మేకర్స్ ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణ్ రామ్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలకు ఎక్కువగా పెద్ద పీట వేస్తాడు. ఎప్పుడు ఆడియెన్స్ కు కొత్త తరహా కథలు అందించాలని ఆరాట పడుతుంటాడు ఈ నందమూరి హీరో. అలా ఓకే చెప్పిన 'బింబిసార' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అదే ఊపులో 'అమిగోస్' అనే చిత్రంలో ఈ ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ బజ్ ఏర్పడింది. కానీ తీరా రిలీజయ్యాక రిజల్ట్ చూస్తే దారుణంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. మరి ఈ సారి డెవిల్ సినిమాతోనైనా కళ్యాణ్ రామ హిట్ కొడుతాడో లేదో చూడాలి.



Also Read: Chandramukhi 2: వామ్మో.. ‘చంద్రముఖి 2’ రన్‌టైమ్‌ అన్ని గంటలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook