Nandini Rai Reveals her Suicidal Thoughts in intial Days: తెలుగు హీరోయిన్ నందిని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులోనే పుట్టి పెరిగిన ఈ భామ చిన్న వయసులోనే మోడలింగ్ కెరీర్ ను ఎంచుకుని అతి తక్కువ కాలంలోనే మంచి మోడల్ గా పేరు తెచ్చుకుంది. అంతేగాక కేవలం లోకల్ బ్రాండ్లకే కాదు అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా మోడల్గా పనిచేసే 2009 అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం కూడా దక్కించుకొని ఆ తర్వాత ఏడాది మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత జీరో ఫోర్ జీరో అనే సినిమాతో హీరోయిన్గా రంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత మాయ కుషి కుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని అనే సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా కనిపించిన ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే తగ్గలేదు. దీంతో హిందీ సినీ అవకాశాలు రావడంతో అక్కడ ఫ్యామిలీ పాక్ అనే సినిమాలో కనిపించింది. అయితే ఈ అన్నిటికంటే ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది బిగ్ బాస్ సీజన్ 2 అని మాత్రమే చెప్పాలి.


ఈ బిగ్ బాస్ సీజన్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక తన కెరీర్ మొదట్లో సినిమాలు బాగా రాలేదు, చేసిన సినిమాలు ఆడలేదని చాలా కృంగిపోయానని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంటి టెర్రస్ నుంచి కూడా దూకి చచ్చిపోవాలని అనుకున్నాను అని అయితే ఆ తర్వాత ఆలోచన తప్పు అని తెలుసుకుని మిత్రులతో రోజు మాట్లాడుతూ నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నానని చెప్పుకొచ్చింది.


ఆ తర్వాత సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని ఎట్టకేలకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డానని ఆమె చెప్పకు వచ్చారు. ఇక జయాపజయాలకు పొంగిపోవడం కుంగిపోవడం వంటి విషయాలు కరెక్ట్ కాదని అప్పుడే సైకాలజిస్ట్ దగ్గర నుంచి తెలుసుకున్నానని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితం అని అప్పుడే అర్థం చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు. హిట్ ఫ్లాప్ అనేది మనకి తెలియదని, అది మన కెరీర్  డిసైడ్ చేయదని అప్పుడే అర్థమైందని అందుకే మళ్ళీ నా ప్రయత్నాలు మొదలు పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.


ఇక ఈ మధ్య ఈ భామ తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది. అలా అయినా ఏదో ఒక నిర్మాత దృష్టిలో పడి సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది ఈ భామ. ఇక రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నందిని కనిపించింది. అలాగే ఆహాలో పంచతంత్ర కథలులో కూడా ఆమె ఒక కీలక పాత్రలో కనిపించింది.  అంతకుముందు ఆమె ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే ఒక వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చింది.


Also Read: Pawan kalyan-Sujeeth : పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రంగంలోకి డీవీవీ సంస్థ!


Also Read: Rana Daggubati: ఇండియా ఎయిర్ లైన్స్ చెత్త.. ఇలాంటి సర్వీస్ ఎక్కడా చూడలేదంటున్న రానా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook