Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ చెత్త.. ఇలాంటి సర్వీస్ ఎక్కడా చూడలేదంటున్న రానా!

Rana Daggubati Slams Indigo airlines: తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించిన రానా దగ్గుబాటి బ్యాగేజ్ మిస్ అవ్వడంతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ ఇండిగో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.​  

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 4, 2022, 06:08 PM IST
Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్ చెత్త.. ఇలాంటి సర్వీస్ ఎక్కడా చూడలేదంటున్న రానా!

Rana Daggubati Slams Indigo airlines: సినీ నటులకు ఒక్కోసారి విమానయాన సంస్థల నుంచి అనుకోని షాక్ లు ఎదురవుతూ ఉంటాయి. దీంతో వెంటనే వారు తమ అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న దాఖలాలు ఎన్నో చూసాము. ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి వంతు వచ్చింది. ఆయన ఇండిగో ఎయిర్ లైన్స్ ద్వారా ప్రయాణించినట్లు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన బ్యాగేజ్ మిస్ అవ్వడంతో ఆయన వరుసగా ట్వీట్లు చేస్తూ ఇండిగో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు.

ఇండియాలో వరస్ట్ ఎయిర్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇండిగో జరిగిందని ఫ్లైట్ టైం ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదని మిస్సింగ్ లగేజ్ ఇప్పటికీ తన చేతికి రాలేదని ఈ విషయం స్టాఫ్ కు తెలుసు కానీ నా లగేజ్ ఎక్కడుందో కూడా తెలియదని పేర్కొన్నారు. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా ట్విట్టర్ లో ఇండిగో షేర్ చేస్తున్న అన్ని పోస్టులకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. టెక్ ఫోర్స్ అంటూ తన ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లైట్లు నడి

చేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు.

 

అంటే దానికి కౌంటర్ వేస్తూ ఇంజనీర్స్ అంటే గుడ్ స్టాఫ్ అయినా వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు మీరు సరిగ్గా పని చేయాల్సిన అవసరం ఉంది అని రానా పేర్కొన్నారు. ఆ తర్వాత విమానం కిటికీలో నుంచి మేఘాలలో ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ స్వర్గం ఇక్కడే దొరికేసింది అంటూ ఇండిగో షేర్ చేయగా దొరికిన దానికంటే పోయిన స్వర్గాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ తన లగేజ్ గురించి ప్రస్తావిస్తూ రానా కామెంట్ చేశారు.

ఇక ఆ తర్వాత ఇండిగో ఒక వింటర్ సేల్ అలర్ట్ ప్రకటించింది అదేమిటంటే భారతదేశం లోపల 2128 రూపాయల నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతాయని ఆరో తేదీ ముందు టికెట్ బుక్ చేసుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ప్రయాణించవచ్చని పేర్కొంటే దానికి కూడా రానా కౌంటర్ వేస్తూ ఈ ఫ్లైట్లు అసలు ఎగరావచ్చు ఎగిరిన తర్వాత ల్యాండ్ అవ్వకపోవచ్చు షెడ్యూల్ ప్రకారం ఏది జరగదు ఇక మీ లగేజ్ గురించి వాళ్ళకి ఏమీ తెలియదని చెబుతారు అంటూ వరుసగా ట్వీట్లు చేశారు. ఇక రానా దగ్గుబాటి చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.

Also Read: Pawan kalyan-Sujeeth : పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రంగంలోకి డీవీవీ సంస్థ!

Also Read: Deepthi Sunaina Hot Photos: బక్కచిక్కిన దీప్తి సునైనా... హీరోయిన్ లా మారిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News