Pawan kalyan-Sujeeth : పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రంగంలోకి డీవీవీ సంస్థ!

Pawan kalyan Movie with Sujeeth: పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే, ఇప్పుడు సుజీత్ డైరెక్షన్లో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 4, 2022, 09:54 AM IST
Pawan kalyan-Sujeeth : పవన్ కళ్యాణ్ తో సుజీత్ సినిమా.. ఆర్ఆర్ఆర్ తరువాత రంగంలోకి డీవీవీ సంస్థ!

Pawan kalyan Movie with Sujeeth Announced: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారం నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో డైరెక్టర్ సుజీత్ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా మారిన సుజీత్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో లాంటి సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.  కానీ ఆ సినిమా ద్వారా ఆయన అనుకున్న ఫలితం అయితే సాధించలేకపోయాడు.  

కలెక్షన్స్ పరంగా సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కానీ తెలుగు ప్రేక్షకులను సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నార్త్ బెల్ట్ లో ప్రేక్షకులను కొంతమేర ఈ సినిమా ఆకట్టుకోవడంతో ఆ మేర కలెక్షన్లు వచ్చాయి. ఇక సాహో సినిమా తర్వాత సుజిత్ గాడ్ ఫాదర్ సినిమా డైరెక్ట్ చేయాల్సి ఉంది కానీ ఆయన చేసిన డీటైలింగ్ నచ్చకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సుజీత్ ని పక్కన పెట్టారు. ఇలాంటి తరుణంలో ఇక ఎవరితో సుజిత్ సినిమా చేస్తాడు అంటూ అనేక చర్చలు జరిగాయి.

అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కు ఆయన ఒక కథ చెప్పాడని దానికి బాగా ఇంప్రెస్ అవడంతో ఏకంగా లంచ్ కి కూడా పవన్ కళ్యాణ్ పిలిచాడు అని ప్రచారం జరిగింది. అయితే అనేక ప్రచారాల్లో ఇది కూడా ఒక భాగమేనని అదేమీ అయి ఉండకపోవచ్చు అని కూడా ఒక వాదన వినిపించింది. కానీ ఎట్టకేలకు అది నిజమేనని చెబుతూ డివివి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారని అది మా బ్యానర్ లోనే చేస్తున్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి నిర్మాణం వహించిన డివివి దానయ్య ఆ తర్వాత వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ సినిమా ఆగి పోయినట్లయితే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఉంది.

ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయడంతో డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక ఈ మేరకు ఒక అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్లో రవి కె చంద్రన్ ఈ సినిమాకి డైరెక్టర్ ఆ ఫోటోగ్రఫీ గా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి నిలబడిన ఒక ఫోటో కనిపిస్తోంది అలాగే బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని చారిత్రక కట్టడాలు అలాగే పలు ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి.

ఇక ఏదో కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అయితే ఇది ప్రేక్షకులలో అనేక అనుమానాలకు కారణం అవుతుంది. మరి ఈ సినిమాని పాన్ ఇండియాలో రూపొందిస్తారా? లేదా? అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Pawan Kalyan: నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్..జనసేనాని వ్యాఖ్యలు వైరల్

Also Read: Kavitha Flexies: డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

More Stories

Trending News