Nani Fani Interesting Request to Hit Director Sailesh Kolanu: విశ్వక్ సేన్ హీరోగా రుహానీ శర్మ హీరోయిన్ గా హిట్ అనే సినిమా చేసి హిట్టు కొట్టాడు దర్శకుడు శైలేష్ కొలను. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఆయన హీరో నానితో పరిచయం ఏర్పడగా తన దగ్గర ఉన్న కథ చెప్పి నాని దగ్గర మంచి మార్కులు కొట్టేయడమే గాక దర్శకుడిగా కూడా చేయమని నాని ప్రోత్సహించడంతో దర్శకుడిగా మారారు. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో భాగంగానే అడవి శేషు హీరోగా హిట్ సెకండ్ కేసు అనే సినిమా రిలీజ్ చేశారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, సుహాస్, కోమలి ప్రసాద్, లావణ్య, పావని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా చివర్లో మూడో భాగంలో కనిపించేది నాని అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. హిట్ థర్డ్ కేసులో నాని హీరోగా కనిపించబోతున్నాడు. అర్జున్ సర్కార్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు.


ఇక ఈ విషయం నిన్నే రివీల్ కావడంతో నాని ఫాన్స్ అయితే గాల్లో తేలుతున్నారు ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో పూర్తిస్థాయి వైలెన్స్ పెద్దగా చూడలేదని ఈ సినిమా ద్వారా నానీలో ఉన్న మరో యాంగిల్ బయటకు వస్తుందని భావిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఆసక్తికరమైన విధంగా శైలేష్ కొలనును అభ్యర్థించాడు/ దానికి దర్శకుడుగా కూడా అదే విధంగా స్పందించాడు. ఒక నాని అభిమాని శైలేష్ కొలను అన్నా, చిన్న రిక్వెస్ట్ ఎలివేషన్స్ కరువయ్యి మా ఫ్యాన్ డం ఎండిపోతోంది. కొంచెం ఎం అనుకోకుండా మావోడు నించుంటే ఎలివేషన్, కూర్చుంటే ఎలివేషన్, అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుండాలి, అవసరమైతే అనిరుధ్ ను హిట్ 3కి తీసుకోండి అంటూ కోరడంతో దానికి దర్శకుడు కూడా అదే విధంగా స్పందించాడు చంపేద్దాం బ్రో ప్రామిస్ అంటూ కామెంట్ చేశాడు.


 ఇక మూడవ భాగంలో నానితో పాటు విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నాడు అని ముందు ప్రచారం జరిగింది కానీ హిట్ రెండవ భాగంలో మాత్రం ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. అలాగే హిట్2లో సీరియల్ కిల్లర్ విషయంలో కూడా టీం సస్పెన్స్ పాటించింది గాని ప్రేక్షకులు మాత్రం చివర్లో సీరియల్ కిల్లర్ని చూసి ఉసూరుమంటున్నారు. అయితే టీం ఈ విషయాన్ని రివీల్ చేయవద్దని ముందు నుంచి కోరుతున్న నేపథ్యంలో  అతను ఎవరనే విషయం మాత్రం బయటకు పక్కకు పోవడం గమనార్హం.
Also Read: Balakrishna vs Chiranjeevi: ఆ విషయంలో చిరుపై బాలయ్యదే పై చేయి.. కానీ ముందుంది ముసళ్ల పండుగ!


Also Read: Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook