Balakrishna vs Chiranjeevi: ఆ విషయంలో చిరుపై బాలయ్యదే పై చేయి.. కానీ ముందుంది ముసళ్ల పండుగ!

Balakrishna Veera simha Reddy on January 12th: వారసుడు అలాగే వీర సింహారెడ్డి సినిమాలు మాత్రం 12వ తేదీన రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 3, 2022, 02:39 PM IST
Balakrishna vs Chiranjeevi: ఆ విషయంలో చిరుపై బాలయ్యదే పై చేయి.. కానీ ముందుంది ముసళ్ల పండుగ!

Balakrishna Veera simha Reddy to Release on January 12th: సాధారణంగా సినిమాలకు సంక్రాంతి బాగా కలిసి వచ్చే సీజన్, అందుకే పెద్ద సినిమాలు రెండు మూడు అయినా సరే ఆ సీజన్లో రిలీజ్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ ఉంటారు దర్శకనిర్మాతలు. ఇక 2023 సంక్రాంతికి కూడా పలు పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలని ముందు భావించారు. ప్రభాస్ ఆదిపురుష్ లాంటి సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అందరూ భావించారు. అయితే ఆదిపురుష్ వాయిదా పడటంతో ఈసారి సంక్రాంతికి తెలుగు నుంచి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకున్నాయి.

నిజానికి ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కావడంతో రెండు సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయకపోవచ్చు అని ముందు భావించారు. అయితే ఇద్దరు హీరోలు బడా హీరోలు కావడం, ఇద్దరూ వెనక్కి తగ్గే యోచనలో లేకపోవడంతో ఒకరోజు గ్యాప్ తో సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమాకు బాబీ డైరెక్షన్ చేయగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా మొత్తం సాగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరో పక్క గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ చేసిన సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటించింది.

ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించి ముందు ఏ సినిమా విడుదలైనా ఆ సినిమాకి మంచి ప్లస్ అవుతుందని అందరూ భావించగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.  అది ఏమిటంటే ఈ సినిమా పోటీలో ముందుగా నందమూరి బాలకృష్ణ దిగబోతున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి 12వ తేదీన దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన వారసుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ముందుగా తమిళ తెలుగు ద్విభాషా చిత్రమని ప్రకటించారు కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో పూర్తిగా తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు.

ఈ విషయంలో సినీ పరిశ్రమ నుంచి కొంత వ్యతిరేకత ఎదురైనా దిల్ రాజు మాత్రం అందరితో సంప్రదింపులు జరుపుతూ ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈ సినిమాతో పోటీగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జనవరి 13వ తేదీన సింగిల్ గా చిరంజీవి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి 13వ తేదీన రాబోతుండగా వారసుడు అలాగే వీర సింహారెడ్డి సినిమాలు మాత్రం 12వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. ఒకరకంగా ఇది బాలకృష్ణకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నా దిల్ రాజు దెబ్బకు ఎక్కువ థియేటర్లు వారసుడు సినిమాకు దక్కడంతో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇది ఏమవుతుంది అనేది.

Also Read: Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్

Also Read: HIT 2 Collections : హిట్ 2 కలెక్షన్లు.. రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన అడివి శేష్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News