Dasara OTT Release Date : నాని దసరా మూవీ.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే
Dasara OTT Release Date నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లో వంద కోట్ల బొమ్మగా నిలిచిపోయింది. అయితే దసరా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Dasara OTT Release Date నాని నటించిన దసరా సినిమా గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. నాని కెరీర్‌లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. నాని కెరీర్‌లో వంద కోట్ల సినిమా వస్తుందా? అని అంతా అనుకున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభంలోనే వంద కోట్లు కొట్టేశాడని, నాని ఇంకా కొట్టలేదని అప్పట్లో టాక్ నడిచేది. ఇప్పుడు నాని దసరా సినిమాతో ఆ ఫీట్‌ను సాధించాడు. కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టేశాడు నాని. అలాంటి దసరా సినిమా ఇక ఓటీటీలోకి రాబోతోంది.
నాని దసరా సినిమా మే 30 నుంచి నెట్ ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా అప్పటి వరకు ఇంకా బాక్సాఫీస్ వద్ద ఆడుతూనే ఉండేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన సమంత శాకుంతలం, లారెన్స్ రుద్రుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దీంతో మళ్లీ నాని దసరా సినిమా పుంజుకున్నట్టుగా అయింది. ఇప్పుడు ఈ వీకెండ్‌లోనూ దసరా డామినేషనే కనిపిస్తోంది.
నాని దసరా సినిమాకు ఓవర్సీస్‌లో మంచి విమర్శలు వచ్చాయి. అలానే కలెక్షన్ల విషయంలోనూ దుమ్ములేపేసింది. రెండు మిలియన్ల క్లబ్బులోకి నాని కూడా వెళ్లిపోయాడు. టైర్ 2 హీరోల్లోంచి ఈ ఫీట్‌ను సాధించింది విజయ్ దేవరకొండ, నాని మాత్రమే. దసరా సినిమాతో నాని మాత్రం కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేసినట్టు అయింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల తన సత్తా చాటగా.. కీర్తి సురేష్, నానిలు కమ్ బ్యాక్ ఇచ్చినట్టు అయింది.
Also Read: Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్
ఇప్పుడు నాని తదుపరి చిత్రాల మీద మంచి డిమాండ్ ఏర్పడినట్టు అయింది. అసలే ఇప్పుడు నాని తన రెమ్యూనరేషన్‌ను మరింతగా పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పుడే నాని 20 నుంచి 25 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. నాని తన ముప్పవ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రిస్మస్ సీజన్‌లో నాని తన 30వ సినిమాను విడుదల చేయబోతోన్నాడు. ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook