Hi Nanna: ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా హాయి నాన్న ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్స్ని వివిధ రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో. ఇందులో భాగంగా నాని పొలిటిషన్ అవతారం కూడా ఎత్తి ఈ మధ్య చేసిన కొన్ని ప్రమోషన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి తో.. సైంధవ సినిమా హీరో అయినా మన విక్టరీ వెంకటేష్ తో కూడా ఇంటర్వ్యూ చేశాడు నాని. మొత్తానికి ఇలా తల సినిమా ప్రమోషన్స్ తో పాటు వేరే సినిమాలు ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలకు కూడా బాగా అటెండ్ అవుతున్నారు ఈ హీరో. ఇందులో భాగంగా ఈ హీరో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ కాగా అందులో మెగాస్టార్ చిరంజీవి గురించి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


నాని గత చిత్రం దసరా అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రంగా వచ్చిన సంగతి తెలిసిందే. కాక అలాంటి ఊర మాస్ సినిమా తరువాత నాని పక్క క్లాస్ సినిమా అయినా హాయ్ నాన్న చేస్తూ ఉండడంతో.. ఎందుకు అలా సడన్ గా ఇంత చేంజ్ అని నానిని అడగగా.. దానికి నాని ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. నాని మాట్లాడుతూ.. ‘నేను ఇలాంటి సినిమాలే చేస్తానని ఫ్యాన్స్ ఎప్పుడూ ఫిక్స్ అవలేదు. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గారు అన్నీ మాస్ సినిమాలే చేశారా లేదు కదా.. ఒక వేళ చిరంజీవి గారు అలా మాస్ సినిమాలే చేసి ఉంటే ఆయన ప్రయాణం ఇంత గొప్పగా ఉండేది కాదు. చిరంజీవి గారు మాస్‌లో పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన వరసగా అలాంటి సినిమాలు మాత్రమే తీయకపోవడం వలన అన్ని వర్గాల ప్రేక్షకులను తన విభిన్నమైన సినిమాలతో మెప్పించగలిగాడు." అంటూ నాని తెలియజేశారు.


‘నేను ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. నా కెరీర్‌లో ప్రేక్షకులకు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమాలు చెయ్యాలి అనుకుంటూ ఉన్నా. ప్రేక్షకులు నా సినిమాల గురించి చాలా రోజులు మాట్లాడుకోవాలి.. నాకు అది చాలు. చిరంజీవి గారితో నన్ను నేను పోల్చుకొని ఈ మాట చెప్పడం లేదు.. కేవలం ఒక ఉదాహరణ కోసం ఆయన గురించి చెప్పానంతే‌’ అని తను మాస్ అనాలి క్లాస్ సినిమాలు చేయడానికి అసలు కారణం చెప్పేసారు మన నేచురల్ స్టార్.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook