Naresh, Pavitra Lokesh Wedding News: నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల పెళ్లి ఇవాళ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆమాటకొస్తే టాలీవుడ్ మీడియా మాత్రమే కాదు.. ఎంటైర్ నేషనల్ మీడియా కూడా నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి గురించి ఆసక్తికరమైన కథనాలు రాసుకొచ్చింది. అయితే, అందరి సందేహం ఒక్కచోటుకే వచ్చి ఆగిపోయింది. అదేంటంటే.. నరేష్, పవిత్ర లోకేష్ ల పెళ్లి అసలు నిజమా ? లేక తమ కొత్త సినిమా ప్రమోషన్ కోసం ప్లే చేసిన చీప్ ట్రిక్కా అనే డౌట్ వద్దే అన్ని కథనాలు ఆగిపోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్ర లోకేష్‌లు సహ జీవనం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకున్న వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనే వార్తల సంగతిని కాసేపు పక్కనపెడితే.. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది. అధికారికంగా విడాకులు మంజూరు కానిదే మరో పెళ్లి చేసుకుంటే అది పెద్ద నేరం అవుతుంది. గృహ హింస కిందకు వస్తుంది. అదే కానీ జరిగితే లీగల్‌గా ప్రస్తుత భార్య రమ్యదే పైచేయి అవుతుంది. అంటే ఆమె చేతిలో నరేష్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. నరేష్ ఈ విషయం తెలియనంత అమాయకుడు కాదు కాబట్టి అలాంటి పని చేసి ఆ పనిని తనే బహిర్గతం చేసే అవకాశమే లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే.. చాలామంది చెబుతున్నట్టుగా ఇవాళ విడుదల చేసిన పెళ్లి వీడియో తమ తరువాతి సినిమా ప్రమోషనల్ స్టంట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.  


ఈ వ్యవహారం అంతా ఎలా ఉన్నప్పటికీ.. నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి నిజమా కాదా లేక ప్రమోషన్ స్టంటా ? లేదంటే ఈ రెండిట్లో ఏదయినా కావొచ్చు కానీ.. తమ కుటుంబానికి పెద్ద దిక్కయిన స్టెప్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణను పోగొట్టుకుని ఇంకా నిండా నాలుగు నెలలు కూడా కాకముందే అప్పుడే ఇలా ఈ పాడు పనులు ఏంటని నెటిజెన్స్ తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్‌ని కోల్పోయామనే బాధ అభిమానుల్లోనే ఇంతలా ఉంటే.. ఇంకా ఆ ఇంటి మనిషిగా విజయ కృష్ణ నరేష్‌కి ఇంకెలా ఉండాలని కొంతమంది కామెంట్ చేస్తే..  నరేష్ ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే.. సూపర్ స్టార్ కృష్ణను ఏనాడూ తన తండ్రిగా భావించలేదనే అనుకోవచ్చా అని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.


ఇది కూడా చదవండి : Actor Naresh Honeymoon: దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర లోకేష్.. ఎక్కడా తగ్గట్లేదు!


ఇది కూడా చదవండి : Naresh Pavitra Marriage: నరేష్ -పవిత్ర పెళ్లి నిజం కాదు.. బకరాలని చేశారుగా!


ఇది కూడా చదవండి : Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo