Actor Naresh Honeymoon: దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర లోకేష్.. ఎక్కడా తగ్గట్లేదు!

Actor Naresh Honeymoon:  నరేష్, పవిత్ర లోకేష్ హైదరాబాదులో వివాహం చేసుకున్నారంటూ నరేష్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరడం చర్చనీయాంశం అయింది. దుబాయిలో వీరిద్దరూ హనీమూన్ కోసం వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 10, 2023, 03:48 PM IST
Actor Naresh Honeymoon: దుబాయ్ లో హనీమూన్ కు నరేష్, పవిత్ర లోకేష్.. ఎక్కడా తగ్గట్లేదు!

Naresh Pavitra Honeymoon at Dubai: నరేష్, పవిత్ర లోకేష్ మూడుముళ్ల బంధంతో ఏడు అడుగుల సంప్రదాయ నడకతో ఒక్కటైనట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ హైదరాబాదులో వివాహం చేసుకున్నారంటూ నరేష్ స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేయడం మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరడం చర్చనీయాంశం అయింది. వాస్తవానికి నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి.

అంతేకాదు దుబాయిలో వీరిద్దరూ హనీమూన్ చేసుకునేందుకు కూడా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ నిర్మల కుమారుడు వి కె నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా మూడు పెళ్లిళ్లు విఫలమయ్యాయి. ప్రస్తుతానికి ఆయన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొన్నాళ్లుగా పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా మెలుగుతున్న నరేష్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు అంటూ చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఒక భార్య ఉండగా ఆమెకు విడాకులు ఇవ్వకుండా మరో భార్యను వివాహం చేసుకోవడాన్ని ఇండియన్ పీనల్ కోడ్ చట్ట వ్యతిరేకంగా భావిస్తుంది కాబట్టి నరేష్ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.

అయితే ఇప్పుడు నరేష్ వివాహం చేసుకొని దుబాయ్లో హనీమూన్ చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలేవీ నిజం కాదని వారు పెళ్లి, లవ్ అనే కాన్సెప్ట్ కు సంబంధించి ఒక సినిమా చేస్తున్నారని ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇలా చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈరోజు ఉదయం నుంచి నరేష్ పవిత్ర పెళ్లి వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు. మరి ఈ విషయం మీద నరేష్ గాని పవిత్ర లోకేష్ కానీ ఏదో ఒక క్లారిటీ ఇస్తారో లేక ఈ ప్రచారాన్ని ఇలాగే వది లేస్తారో చూడాలి మరి. ఆ సినిమా ప్రకటన ఎప్పుడు ఉంటుందో? 
Also Read: Actor Naresh Marriage: నరేష్-పవిత్రల పెళ్లి వీడియో.. పవిత్ర బంధం అంటూ నటుడి ట్వీట్.. అసలు విషయం ఇదా!

Also Read: Actor Naresh Wedding Photos: పవిత్ర మెడలో నరేష్ మూడు ముళ్లు.. దుబాయ్ లో హనీమూన్.. ఫోటోలు వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News