Narne Nithiin - AAY First Look: నార్నే నితిన్ ఫన్ ఎంటర్టైనర్ `ఆయ్` మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
Narne Nithiin - AAY First Look: తెలుగులో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన సంస్థ గీతా ఆర్ట్స్ 2. ఈ బ్యానర్ నుంచి GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 9 తెరకెక్కుతోన్న చిత్రం `ఆయ్`. ఎన్టీఆర్ బ్రదర్ ఇన్ ఇలా నార్నే నితిన్ హీరోగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Narne Nithiin - AAY First Look: నార్నే నితిన్.. ఎన్టీఆర్ బామ్మర్దిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. లాస్ట్ ఇయర్ 'మ్యాడ్' సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ నిర్మాణంలో 'ఆయ్' సినిమా చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ నార్నే నితిన్ 'మ్యాడ్' మూవీతో జబర్ధస్త్ హిట్ అందుకున్నారు. ఎన్టీఆర్ బామ్మర్ధిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. ఇక మ్యాడ్ సినిమాలో సీరియస్ యాక్షన్‌తో ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా 'ఆయ్' సినిమాతో పలకరించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన నయన్ సారిక జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు 'ఆయ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా తెరకెక్కుతుఓంది. పూర్తి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుబోతున్న ఈ సినిమా టైటిల్ వినూత్నంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఫస్ట్ లుక్‌లో నార్నే నితిన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉది. ఈ మూవీలో నార్నే నితిన్ స్నేహితుల పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ నటించారు. మరో వైపు పచ్చదనంతో కూడిన సరస్సుని కూడా చూపిస్తున్నారు. అంటే ఈ చిత్రంలో ప్రకృతి ముఖ్యపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
‘ఆయ్’ అనే పదాన్ని ఎక్కువగా ఉభయ గోదావరి ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే పదాన్ని ఈసినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను గోదావరి నేపథ్యంలో పూర్తి హిల్లేరియస్‌గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.
‘డ్రిజ్‌లింగ్ సమ్మర్’ అంటూ విడుదల విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ చెప్పారు.
ఫన్ రైడర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆయ్’ సినిమా ఇప్పటి ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరెక్కించారు. ప్రేక్షకులు ఈ సినిమాకు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
GA2 పిక్చర్స్: గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్..
మమెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ఇపుడు రాబోయే 'ఆయ్' చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు.
నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు
బ్యానర్ - GA2 పిక్చర్స్
సమర్పణ - అల్లు అరవింద్
నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ - అంజి కంచిపల్లి
సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి
సంగీతం - రామ్ మిర్యాల
ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ - వంశీ కాకా
మార్కెటింగ్ - విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ - అనిల్, భాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook