Narne Nithin: శ్రీ శ్రీ శ్రీ రాజావారు.. దసరా బరిలో దిగనున్న ఎన్టీఆర్ బావమరిది..
Narne Nithin Next Movie: మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నార్నే నితిన్.. ఈ మధ్యనే విడుదలైన ఆయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలతో దూసుకు వెళుతున్న ఈ యువ హీరో ఇప్పుడు మరొక సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
Sri Sri Sri Rajavaru: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు.. అంటే ఎన్టీఆర్ బావమరిదిగా నార్నే నితిన్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా మ్యాడ్ తోనే ప్రేక్షకులను చాలా బాగా అలరించిన నితిన్ ఈమధ్యనే ఆగస్టు 15న ఆయ్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులను పలకరించారు.
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం దిశగా పరుగులు తీస్తోంది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఇంకా థియేటర్లలోనే ఉంది కానీ నితిన్ అప్పుడే మరొక సినిమా విడుదల కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
శతమానం భవతి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేసిన దర్శకత్వంలో.. నార్నే నితిన్ హీరోగా.. శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంపద ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. శ్రీ వేద అక్షర మూవీస్ పతాకం పై చింతపల్లి రామారావు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమాలో కూడా ఇంతకు ముందు సినిమాలలో లాగా కమర్షియల్ ఎలిమెంట్లతో పాటు.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కి కూడా పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... "మా హీరో నార్నె నితిన్ మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. మా సినిమాను కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ కి ఈ కథ బాగా నచ్చి ఎంపిక చేశారు. ఆయన అంచనాలకి తగ్గకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ దసరాకి నార్నె నితిన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు" అని అన్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read : 1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు
Also Read : Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook