నాగశౌర్య హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా నర్తనశాల టీజర్ ఇవాళే విడుదలైంది. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగశౌర్య మొదటిసారి ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. నాగశౌర్య సరసన కాశ్మీర, యామిని భాస్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐఆర్ఏ క్రియేషన్స్‌పై ఉషా ముల్పురి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే, సినిమాలో కామెడీ కోణం కాస్త ఎక్కువే ఉందని అర్థమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం నర్తనశాల టీజర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

చిన్నప్పటి నుంచి అబ్బాయిని, అబ్బాయిలా కాకుండా అమ్మాయిలా పెంచితే పెళ్లిపై మూడ్ ఎలా వస్తుంది ? నా కొడుకు తేడానా అనే డైలాగ్స్ ఈ సినిమాలో నాగశౌర్య పాత్రపై పలు సందేహాలు కలిగేలా చేస్తున్నాయి. ఏదేమైతేనేం.. మొత్తానికి టీజర్‌తో సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా చేశారు నర్తనశాల మేకర్స్.