Naveen Polishetty Suffers Multiple Fractures: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కాగా ఈ హీరోకి ఇటీవలే అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది.  దీంతో అభిమానులు సైతం కలవరపాటుకు గురయ్యారు.. త్వరలోనే కోలుకోవాలని కోరుకున్నారు. అయితే తాజాగా తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవీన్ పోలిశెట్టి.. తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయని..  కాలికి కూడా గాయమైందని.. చాలా కష్టంగా అనిపిస్తోందని కానీ త్వరగా పూర్తిగా కోలుకునేందుకు కృషి చేస్తున్నాను అని.. ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. “దురదృష్టవశాత్తు  ఇటీవల నా కుడి చేతికి పలు ఫ్రాక్చర్ లో అయ్యాయి. బాధను భరించలేకపోతున్నాను.. నా కాలికి కూడా గాయం అయింది.. ఈ కష్టమైన పరిస్థితి నుండి బయట పడాలంటే ఇంకా సమయం పడుతుంది. అందుకే నేను సినిమాలను చేయలేకపోతున్నాను.. మీతో కనెక్ట్ కాలేకపోతున్నాను.. అయితే ఈ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు.. మంచి మంచి కథలు వింటున్నాను త్వరలోనే మీ ముందుకు అద్భుతమైన సినిమాతో వస్తాను” అంటూ నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. 


“రికవరీ అవ్వడం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది.. దాన్ని ఇది.. అంతే కఠినంగా ఉంటుంది. కానీ నేను పూర్తిగా కోల్పోవడానికి వైద్య నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను.. అందువల్ల మీ అందరి కోసం మళ్లీ వేగంగా ఆరోగ్యంగా తిరిగి వస్తాను. మునుపెన్నడూ లేనంత ..ఆరోగ్యంగా బలంగా తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను” అంటూ తెలిపాడు నవీన్ పోలిశెట్టి.


ప్రస్తుతం నవీన్ విడుదల చేసిన ఈ నోటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. 
జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి దురదృష్టవశాత్తు.. అమెరికాలో బైక్ ప్రమాదానికి గురైయ్యాడు. మార్చిలో ఈ సంఘటన జరగగా.. ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా గతంలో ఇతడికి బైక్ ఆక్సిడెంట్ అయినట్లు ఆయన బృందం ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు నవీన్ సైలెంట్ గానే ఉన్నాడు. కానీ దాదాపు మూడు నెలల తర్వాత మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టారు.


 



Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం


Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి