Nawazuddin Siddiqui's Wife: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి భార్య ఆలియా సిద్ధిఖి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త నవాజుద్దీన్ సిద్ధిఖి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖి తన పేరు, పలుకుబడి ఉపయోగించి తన కూతురు, కుమారుడిని తన నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. భర్తపై రేప్ కేసు పెట్టిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆలియా సిద్ధిఖి.. అందుకు సంబంధించిన ఆధారలను కూడా పోలీసులకు సమర్పించానని స్పష్టంచేశారు. భర్త నవాజుద్దీన్ సిద్ధిఖి తనపై కుట్రలకు పాల్పడుతున్నాడని చెప్పే క్రమంలో ఆలియా కన్నీంటిపర్యంతమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని వర్సోవా పోలీసు స్టేషన్ లో భర్తపై కేసు పెట్టానని చెప్పిన ఆలియా సిద్ధిఖి.. పిల్లలను తన నుంచి దూరం చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని ఆలియా ఆవేదన వ్యక్తంచేశారు. ఏదేమైనా సరే తన పిల్లలను అతడి కస్టడీలోకి వెళ్లనివ్వను అని ఆలియా స్పష్టంచేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖి తన పిల్లలకు మంచి తండ్రి కూడా కాడు. తన బిడ్డను పుట్టినప్పటి నుంచి ఏనాడు ఆదరించలేదు. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్ధవాళ్లు అవుతుంటే వాళ్లను తన సొంతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నాడు. 


ఒక భార్యగా నవాజుద్దీన్ ఏనాడు నాపై ప్రేమ చూపలేదు. ఏనాడూ నన్ను గౌరవించలేదు. నా జీవితంలో ఎన్నో విలువైన కాలం అతడి కోసం, అతడితో గడిపాను. ఇప్పుడు నేను అన్ని విధాల వీక్ అయ్యాను. ఆర్థికంగానూ వీక్ అయ్యాను. ఫేమ్ అతడి నెత్తికెక్కింది. నా కొడుకును కూడా ఏనాడూ చేరదీయలేదు. ఇప్పుడు పిల్లలపై ప్రేమ నటించి వాళ్లను నా నుంచి లాగేసుకోవాలని అనుకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆలియా సిద్ధికి నవాజుద్దీన్ సిద్ధిఖికి రెండో భార్య. 2009లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆలియా అసలు పేరు అంజలి కిషోర్ పాండే. నవాజుద్దీన్‌తో పెళ్లి తరువాత ఆమె ఆలియా సిద్ధిఖిగా పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్ల కాపురం కలహాల కాపురమైంది. ఎన్నోసార్లు వార్తల్లో పతాకశీర్షికలకు ఎక్కిన ఈ జంట.. గతేడాది తమ విబేధాలను పక్కకు పెట్టి తిరిగి కలిసిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆలియా సిద్ధిఖి మరోసారి సంచలన ఆరోపణలు చేస్తూ అతడిపై కేసు పెడుతూ పోలీసు స్టేషన్ మెట్లెక్కడం జరిగింది.