Nayakudu Trailer Review: తమిళంలో ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తోన్న మామన్నన్ మూవీ తెలుగులో నాయకుడు అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంతో తెరకెక్కిన నాయకుడు సినిమాలో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మళయాళం నటుడు ఫహజ్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. మారి సెల్వరాజ్ రచించి డైరెక్ట్ చేసిన నాయకుడు మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు మరో వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా నాయకుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. నాయకుడు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర నిర్మాతలు తెలుగు ట్రైలర్ ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వడివేలు, ఉదయనిధి స్టాలిన్ తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించిన నాయకుడు సినిమాలో సామాజికంగా వెలి వేయబడిన అట్టడుగువర్గాలు అధికార బలం, అంగబలం ఉన్న అగ్రవర్ణాలకు చెందిన ఒక వ్యక్తి చేతిలో నలిగిపోతున్న వైనాన్ని చూపించడంతో పాటు.. ఒక యువకుడు ఆ అగ్రవర్ణాల పీడిత వ్యవస్థపై యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటుందనే కోణాన్ని కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. 


అధికారబలం, అంగబలం తనదేనన్న అహంకారంతో కొట్టుకుంటున్న ఒక రాజకీయ నాయకుడి పాత్రలో ఫహద్ ఫాసిల్ ఎంట్రీ ఇవ్వగా.. అతడిపై దండెత్తిన తండ్రి కొడుకుల పాత్రల్లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కనిపించారు. 


Mahesh Babu, Nayakudu Trailer Review, SS Rajamouli, Udhayanidhi Stalin, Fahadh Faasil, Vadivelu, Keerthy Suresh, Nayakudu trailer, Nayakudu Movie Review, Nayakudu movie, Nayakudu 2023, Nayakudu 2023 songs, Nayakudu 2023 Review


 


ఉదయనిధి స్టాలిన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి జులై 14న మామన్నన్ అనే ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో నాయకుడు పేరిట రిలీజ్ చేయనున్నాయి. సమాజంలో ఉన్న సామాజిక అంశాలు, సమస్యలు, అహంకారం ఉన్న అగ్రవర్ణాల చేతిలో అట్టడుగువర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, భౌతిక దాడులను నాయకుడు సినిమాలో స్పష్టంగా చూపించారు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.