Bigg Boss 7 Telugu 06th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 రసవత్తరంగా సాగుతోంది. రోజుకో ట్విస్ట్ ఇస్తూ షో ను రక్తి కట్టిస్తున్నారు మేకర్స్. ఈ షో ఇప్పటికే ఆరు వారాలను పూర్తి చేసుకుని ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. మరో ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ కాగా... అర్జున్ అంబటి, సింగర్ భోలే, నయని పావని, అశ్వినిశ్రీ, పూజా మూర్తి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చారు. ఈ ఐదుగురు వచ్చి వారం గడిచింది. ప్రస్తుతం నామినేషన్స్ లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్, నయని పావని, టేస్టీ తేజ, పూజా మూర్తి, అశ్విని శ్రీ, శోభా శ్రీ ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యధిక ఓటింగ్ తో యావర్ తొలి స్థానంలో ఉండగా.. అమర్ దీప్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో నయని పావని, శోభాశెట్టి నిలుస్తూ వచ్చారు. పోల్స్ ప్రకారం, ఈ వారం శోభా శెట్టే ఎలిమినేట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ బిగ్ బాస్ నిర్వహకులు హాట్ బ్యూటీ నయని పావనిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నయని బాగా ఆడుతూ వస్తుంది. ప్రిన్స్ కెప్టెన్ కావడానికి కూడా నయనినే కారణం. అయితే శోభాశెట్టిని కాపాడటానికే నయనిని బలి చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినా నయని విషయంలో అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ కోసమే నయని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read: Saindhav Update: వెంకీ అభిమానులకు గుడ్ న్యూస్... సైంధవ్ టీజ‌ర్‌ డేట్, టైమ్ ఫిక్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి