Nayanthara Twin Babies :  మామూలుగా అయితే ఎవ్రీ వన్ ఆఫ్ యూ అని అంటూ విషెస్ చెబుతాం.. కానీ విఘ్నేశ్ శివన్ మాత్రం కవల పిల్లలు పుట్టిన ఆనందంలో ఉన్నాడు కాబట్టి.. ఎవ్రీ టూ ఆఫ్ యూ అని విషెస్ చెప్పాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని విఘ్నేశ్ శివన్ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. ఇందులో నయన్, విఘ్నేశ్ ఇద్దరూ కూడా తమ పిల్లలను చేతుల్లో ఎత్తుకుని ఉన్నారు. ఇక నయన్ ముసి ముసి నవ్వులు నవ్వేస్తోంది. వీడియో చివర్లో నయన్ నుదుటిని విఘ్నశ్ ఓ ముద్దు కూడా పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అందరూ సంతోషంగా ఉండాలి.. కష్టాలు తొలిగి అందరికీ సుఖసంతోషాలు ప్రాప్తించాలి.. అందరూ అందరికీ కోసం ప్రార్థించండి.. ప్రేమను పంచండి.. మన అందరికీ పంచగలిగేది ప్రేమను మాత్రమే.. ఈ జీవితాన్ని ఎంతో అందంగా మార్చేది కూడా ఈ ప్రేమే.. దేవుడి పట్ల, ప్రేమ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలోని మంచి పట్ల మనం నమ్మకంగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది అంటూ విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు.


మొత్తానికి ఈ దివాళికి డబుల్ ధమాకా అన్నట్టుగా విఘ్నేశ్, నయన్ జోడికి కవల పిల్లలు పుట్టారు. ఈ కవల పిల్లల విషయంలో  జరిగిన కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా నయన్ పిల్లలను కనడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మనదేశంలో సరోగసి అనేది నిషేదం. అయినా నయన్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఎవరి అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నదంటూ చర్చ జరిగింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.


దుబాయ్‌లోని తెలిసిన వ్యక్తి ద్వారా ఈ సరోగసి ప్రాసెస్ జరిగిందని నయన్ చెప్పింది. ఇక తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అలా నయన్ సరోగసి, కవల పిల్లల పుట్టుక మీద నేషనల్ వైడ్‌గా ఎంతో చర్చ జరిగింది.


నయన్ ప్రస్తుతం తెలుగు వారిని గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. గాడ్ ఫాదర్ చిత్రయూనిట్‌కు, తన అభిమానులకు థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం నయన్ షారుఖ్ సినిమాతో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే.


Also Read : Manchu Vishnu - Prabhas : బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్.. ప్రభాస్‌కు విషెస్.. మంచు విష్ణుపై ఫ్యాన్స్ ఫైర్


Also Read : Puri Jagannadh Audio Leak : లైగర్ దెబ్బ మామూలుగా లేదు.. డిస్ట్రిబ్యూటర్లకు వార్నింగ్!.. పూరి ఆడియో లీక్?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook