Manchu Vishnu - Prabhas : బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్.. ప్రభాస్‌కు విషెస్.. మంచు విష్ణుపై ఫ్యాన్స్ ఫైర్

Manchu Vishnu - Prabhas మంచు విష్ణు వేసిన ట్వీట్ ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీసేలా ఉంది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మంచు విష్ణు మీద ఫైర్ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 10:13 AM IST
  • నెట్టింట్లో ప్రభాస్ బర్త్ డే సందడి
  • విషెస్ చెప్పిన మంచు విష్ణు
  • డార్లింగ్ అభిమానుల ఆగ్రహం
Manchu Vishnu - Prabhas : బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్.. ప్రభాస్‌కు విషెస్.. మంచు విష్ణుపై ఫ్యాన్స్ ఫైర్

Manchu Vishnu - Prabhas : మంచు విష్ణు ప్రస్తుతం ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా కూడా కాంట్రవర్సీగా మారుతోంది. మంచు విష్ణు జిన్నా సినిమా కూడా ఇప్పుడు ఫుల్ ట్రోలింగ్‌ను ఎదుర్కోంటోంది. అంతో ఇంతో పాజిటివ్ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. టికెట్లు తెగక షోలు క్యాన్సిల్ అవుతున్నాయని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో అయితే జిన్నా పరిస్థితి మరింత దారుణంగా ఉందని టాక్. కనీసం వెయ్యి డాలర్లను రాబట్టేందుకు జిన్నాకు మూడు రోజులు పట్టిందని సమాచారాం.

 

అలా మంచు విష్ణు తన జిన్నా సినిమాతో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ బర్త్ డేకు విషెస్ చెబుతూ మంచు విష్ణు వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులోని విషయం, కొన్ని పదాల మీద డార్లింగ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అది మంచి ఉద్దేశ్యం అయినా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మనం అన్నదమ్ములమే అనే సెన్స్‌లో మంచు విష్ణు ఓ ట్వీట్ వేశాడు. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని రాశాడు. దీనిపై ప్రభాస్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేయమని కోరుతున్నారు. మామూలుగా విషెస్ చెప్పొచ్చు కదా? ఇలా మదర్.. అనదర్ మదర్ అనాల్సిన అవసరం లేదు.. ఊరికే బ్రదర్ అని కూడా వాడొచ్చంటూ మంచు విష్ణుకి సూచిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

 

ఇక ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్థావించడం అవసరమా? అంటూ కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పుట్టిన రోజు వరకైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడో లేదో గానీ బ్లాక్ బస్టర్ హిట్లు మాత్రం కొట్టేస్తాడు అన్న సెన్స్‌లో ట్వీట్ వేశాడు. ఇప్పుడు పెళ్లి మ్యాటర్ అవసరమా? అది లేకుండా ట్వీట్ వేయలేవా? అంటూ మంచు విష్ణు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్‌ అప్డేట్లు చూసి విసిగిపోయి ఉన్న ఫ్యాన్స్‌కు మంచు విష్ణు ట్వీట్ మరింతగా మంట పెట్టినట్టుంది. అయితే సలార్ నుంచి వదిలిన వర్కింగ్ స్టిల్ చూసి డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ది బెస్ట్ అప్డేట్ అంటూ ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే టీంలను దారుణంగా తిట్టేశారు.

Also Read : T20 World Cup : మన పాపకు ఇప్పుడు అర్థంకాకపోవచ్చు గానీ.. అనుష్క శర్మ ఎమోషనల్

Also Read : Actress Pragathi : నేను అందగత్తెని.. నాకు ఆఫర్లు వస్తాయ్.. నటి ప్రగతి బోల్డ్ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News